SSMB 29 Priyanka Chopra : మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న #SSMB29పై వారి అభిమానుల్లోనే కాకుండా సినీ లవర్స్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం వారందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో దీనికి సంబంధించి రూమర్ అయినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త మూవీ లవర్స్ దృష్టి ఆకర్షించింది. ఇంతకీ అదేంటంటే?
మహేశ్ సరసన ప్రియాంక?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 'SSMB 29'లో నటించనున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. దీనికి తగ్గట్లుగా ఆమె తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో ఆమె మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ అభిమానులు అంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
BREAKING: Priyanka Chopra lands🛬 in Hyderabad for Mahesh Babu - Rajamouli project SSMB29. pic.twitter.com/6x131pNj7v
— Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2025
దాదాపు 20ఏళ్ల పాటు బీటౌన్‌లో రాణించిన ప్రియాంక, హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అలా గ్లోబల్ స్టార్ ట్యాగ్ సంపాదించిన ప్రియాంకను సినిమాలో తీసుకుంటే హాలీవుడ్ లెవెల్లోనూ క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారని అంటున్నారు. కానీ, ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
షూటింగ్ అప్పుడే షూరు : ఇక ఈ సినిమా కన్ఫార్మ్ అయ్యి చాలా రోజులు గడుస్తున్నాప్పటికీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ గ్యాప్‌లో అటు జక్కన్న, ఇటు మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్లారు. అయితే 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
సినిమా కథ విషయానికొస్తే, ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి తెరపై ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో దీనిపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి . అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్ కనిపించనున్నారు.
'SSMB సినిమా ఏడాదిన్నరలోనే వచ్చేస్తుంది'- మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్‌పై చెర్రీ కామెంట్స్