ETV Bharat / entertainment

కానిస్టేబుల్​ చారులత ఎంట్రీ - 'సరిపోదా శనివారం'లో ఇంట్రెస్టింగ్​గా ప్రియాంక రోల్! - Priyanka Arul Mohan Nani Movie - PRIYANKA ARUL MOHAN NANI MOVIE

Priyanka Arul Mohan Birthday Special : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ బర్త్​డే సందర్భంగా సరిపోదా శనివారం మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసి ఆమెకు విషెస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె రోల్ ఏంటో రివీల్ చేసింది.

Priyanka Arul Mohan Birthday Special
Priyanka Arul Mohan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 5:24 PM IST

Priyanka Arul Mohan Birthday Special : 'గ్యాంగ్ ​లీడర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నెమ్మదిగా తెలుగు ఆడియెన్స్​కు దగ్గరైంది. అయితే ఆ చిత్రం తర్వాత టాలీవుడ్​లో కనిపించలేదు.తాజాగా నేచురల్ స్టార్ సరసన నటించేందుకు సిద్ధమైంది. 'సరిపోదా శనివారం'తో ఇక్కడి అభిమానులను మరోసారి పలకరించనుంది.

అయితే అప్పట్లోనే ఈమె ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ఖరారైనప్పటికీ తన రోల్ గురించి మేకర్స్ ఎటువంటి హింట్ ఇవ్వలేదు. తాజాగా ప్రియాంక బర్త్​డే సందర్భంగా ఆమె పాత్ర గురించి ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇందులో చారుల‌త‌ అనే పేరు గల ఓ పోలీస్ కానిస్టేబుల్​​గా కనిపించనున్నారని తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రియాంక లుక్​ను కూడా విడుదల చేశారు.

Saripodhaa Sanivaaram Cast and Crew : ఇక ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక నటిస్తుండగా, తమిళ డైరెక్టర్ ఎస్‌జే సూర్య విలన్​గా నటిస్తున్నారు. మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలను నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి 'గరం గరం' అనే సాంగ్​ను విడుదల చేశారు. లిరిక్స్​తో పాటు ట్యూన్​ కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంది.

ఇది ఓ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందంటూ మేకర్స్ వెల్లడించారు. 'అంటే సుందరానికి' చిత్రం తర్వాత నాని – వివేక్ కాంబోలో రానున్న రెండో సినిమా ఇది. అందుకే దీనిపై మూవీ లవర్స్​లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టైటిల్ రివీల్ వీడియో ఆడియెన్స్​ను ఆకట్టుకోగా, గతంలో వచ్చిన టీజర్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్​లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగ‌ష్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

'గరం గరం'గా సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్​ - విన్నారా? - Saripodhaa Sanivaaram First Single

'శనివారం' కోసం నాని హార్డ్​వర్క్ - స్పెషల్ సెట్​లో భారీ ఫైట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.