కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో 'ప్రేమలు' బ్యూటీ- ఈ ముద్దుగుమ్మ బెస్ట్ మూవీస్ ఇవే! మీరు చూశారా? - Premalu heroine Mamitha Baiju
Premalu Mamitha Baiju: రీసెంట్ హిట్ సినిమా ప్రేమలులో రీనుగా తెలుగు యువత మనసు దోచుకుంటున్న మమిత బైజు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Published : Mar 18, 2024, 5:45 PM IST
Premalu Mamitha Baiju: మమిత బైజు ఇప్పుడు మలయాళ, తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దానికి కారణం ఆమె ఇటీవలే నటించిన ప్రేమలు సినిమా. ఈ సినిమా మలయాళంలోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో 'రీను' పాత్రలో నటించిన 22ఏళ్ల మమిత తెలుగు యువతకు తెగ నచ్చేసింది.
మమిత బైజు స్వస్థలం కేరళలోని కొట్టాయం, అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. ప్రస్తుతం కొచ్చిలో బీఎస్సీ సైకాలజీ చదువుతుంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే సినిమాతో మాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దగుమ్మ. ఆ తర్వాత మలయాళంలోనే 'ఆపరేషన్ జావా', 'ఖో-ఖో', 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' వంటి సినిమాలు చేసింది. అయితే 2024లో చేసిన 'ప్రేమలు' సినిమా మమితకు మలయాళంలోనే కాదు ఇతర భాషల్లోనూ మంచి పేరు తీసుకువచ్చింది.
సినిమా ఇండస్ట్రీ కూడా ఆమెకు ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకోవాలి అనుకుంటుంది. ఇప్పటికే తమిళంలో జీవీ ప్రకాష్ హీరోగా తెరకెక్కుతున్న 'రెబెల్' సినిమాలో నటిస్తుంది. ఇది త్వరలో విడుదల కానుంది. అయితే తమిళంలో ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే మరో ఛాన్స్ కొట్టేసిందీ ఈ భామ. విష్ణు విశాల్ 21వ సినిమాలో మమిత హీరోయిన్గా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
మమిత నటించిన ఈ 'ప్రేమలు' సినిమా కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్‌తో దూసుకుపోతుంది. దీంతో 2024లో ఇప్పటివరకు రిలీజైన సినిమాలలో బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో నిలిచింది. ఈ సినిమాకు గిరీష్ దర్శకత్వం వహిస్తే, విక్రమ్‌తో పాటు పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ డిస్నీ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మార్చి 29న ఓటీటీలో ప్రసారం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సినిమా బృందం కానీ ఓటీటీ సంస్థ గాని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేమలు బ్యూటీ కూడా బన్నీకి వీర ఫ్యాన్!- నేషనల్ అవార్డ్ విన్నింగ్ రోజు ఏకంగా ఇంటికే వెళ్లిందట
'అసూయ, బాధతో చెబుతున్నా' - ఆ కొత్త హీరోయిన్‌కు ఫిదా అయిపోయిన జక్కన్న!