Prathinidhi 2 Trailer : పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి సినిమా సమాజంలో ఎన్నో సమస్యలపై ప్రశ్నలను లేవనెత్తింది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జర్నలిస్ట్‌గా ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ప్రతినిధి-2. మూర్తి దేవగుప్తపు డైరెక్షన్‌లో నారా రోహిత్ హీరోగా రూపొందిన ప్రతినిధి 2 ట్రైలర్ శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలకు తగినట్లుగానే డైలాగులు ఎన్నికల హీట్ పెంచుతున్నాయి. ప్రేక్షకుల నుంచి ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే?
దాదాపు 2 నిమిషాల 43 సెకన్ల నిడివి ఉన్న ప్రతినిధి 2 ట్రైలర్ పొలిటికల్ డైలాగుతోనే మొదలవుతుంది. ఇందులో నారా రోహిత్ జర్నలిస్టుగా కనిపించనున్నాడు. ట్రైలర్ అంచనాలు పెంచుతోంది."మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంత మంది సూసైడ్ చేసుకున్నారు. ఎంత మంది గుండెపోటుతో చచ్చారు" అని నారా రోహిత్ పలికిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. సహాయనటుడు అజయ్ పలికే "ఈ ఎన్నికలు మనం గెలవడం కష్టం. సంక్షేమ పథకాల పేరుతో ఉన్న బిస్కట్‌లు అన్నీ వేసేశాం" అనే డైలాగును ప్రస్తుత రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని రాసినట్లు కనిపిస్తోంది. "ఒక్క సారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లు ఆడు చెప్పింది చేయాల్సిందే. డిసైడ్ చేస్కో నిన్ను ఎవరు పరిపాలించాలో? డిసైడ్ చేస్కో నీకు ఎవరు కావాలో? వాడా, వీడా, ఇంకెవడైనానా?" అనే నారా రోహిత్ డైలాగుతో ట్రైలర్ ఎండ్ అవుతుంది. పొలిటికల్ డ్రామాతో పాటు యాక్షన్ సీన్‌లు ఆకట్టుకుంటున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమాని కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు. సిరీ లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మ్యూజిక్ మహతి స్వర సాగర్ అందిస్తున్నారు.