ETV Bharat / entertainment

ప్రశాంత్ వర్మ షాకింగ్ డెసిషన్- ఆ స్టార్ కోసం 'జై హనుమాన్' పోస్ట్​పోన్! - Prashanth Varma - PRASHANTH VARMA

Prashanth Varma Jai Hanuman: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బ్లాక్​బస్టర్ హిట్ 'హను- మాన్' సీక్వెల్ 'జై హనుమాన్'కు కొద్దికాలం బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Prashanth Varma Ranveer Singh
Prashanth Varma Ranveer Singh
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 11:11 AM IST

Prashanth Varma Jai Hanuman: 'హను- మాన్' సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల బ్లాక్​బస్టర్ హిట్ అందుకున్నారు. ఫుల్ ఆఫ్ విజువల్స్, గ్రాఫిక్స్​తో హాలీవుడ్ లెవెల్​లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ప్రశాంత్ వర్మ యూనివర్స్​లో ఈ సినిమాకు సీక్వెల్​గా 'జై హనుమాన్' మూవీ రానుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్​పై కూడా అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక ఈ మూవీ 2025లో రిలీజ్ కానుందని చెప్పారు. అయితే ఇక్కడే ప్రశాంత్ ఓ ట్విస్ట్ ఇవ్వనున్నారు.

'హను- మాన్' సినిమా వల్ల ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో నార్త్, హిందీ బెల్ట్​లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. దీంతో బాలీవుడ్​లోనూ ప్రశాంత్ పేరు బాగా వినిపించింది. ఫలితంగా ప్రశాంత్ బాలీవుడ్​లో ఓ సూపర్ ఛాన్స్ పట్టేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్, ప్రశాంత్​తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 'జై హనుమాన్' సినిమాను హోల్డ్​లో పెట్టి రణ్​వీర్​​ హిందీ ప్రాజెక్ట్​ను పట్టాలెక్కించాలని ప్రశాంత్ డిసైడైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్​ను 2025 లోనే కంప్లీట్ చేయలని ప్రశాంత్ భావిస్తున్నారట.

ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ యూనివర్స్​ (PVCU)లో భాగంగా సూపర్ హీరో కాన్సెప్ట్​తోనే తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అటు రణ్​వీర్ కూడా సూపర్ హీరో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. దీంతో ఇది బాలీవుడ్​లోనూ హాట్​ టాపిక్​గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే 'జై హనుమాన్' కోసం ప్రేక్షకులు 2026 దాకా ఆదాల్సిందే! ఇక ఈ ప్రాజెక్ట్​ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీమేకర్స్ రూపొందిచనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రొడక్షన్ హౌస్​ కూడా భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

Hanuman Movie Collection: ఈ ఏడాది చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన హను- మాన్ భారీ విజయం దక్కించుకుంది. రీసెంట్​గా 25 సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక వరల్డ్​వైడ్​గా ఈ మూవీ దాదాపు రూ. 330+ కోట్లు వసూల్ చేసి సంచనలం సృష్టించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రశాంత్ వర్మ సూపర్ అప్డేట్​​ - డ్రాగన్​తో జై హనుమాన్​ పోరాటం! - Prasanth Varma Jai hanuman

ఓటీటీలో వచ్చేసినా థియేటర్లలో తగ్గని హనుమాన్ క్రేజ్​ - 25 సెంటర్లలో 100 రోజులుగా! - Hanuman 100 Days

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.