ETV Bharat / entertainment

ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్- 'సలార్ 2'కు బ్రేక్- ఆ స్టార్ హీరో కోసమేనట! - Salaar Part 2 Postponed - SALAAR PART 2 POSTPONED

Salaar Part 2 Postponed: సూపర్ హిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్స్​కు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగ పర్వం' సినిమాకు ప్రశాంత్ బ్రేక్ ఇవ్వనున్నాడట.

Prashanth Neel
Prashanth Neel
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 11:27 AM IST

Updated : Apr 27, 2024, 12:33 PM IST

Salaar Part 2 Postponed: సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్ట్​లతో బిజీగా ఉన్నారు. రీసెంట్​గా ప్రభాస్ 'సలార్ పార్ట్ 1- సీజ్​ఫైర్'తో బ్లాక్​బస్టర్ హిట్ అందుకున్న ఆయన దీని సీక్వెల్ 'శౌర్యంగ పర్వం'పై దృష్టి పెట్టారు. ఏప్రిల్​లో చిత్రీకరణ ప్రారంభమైందని, 2025లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే ఇంతలోనే డైరెక్టర్ ప్రశాంత్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన లైనప్​ ప్రకారం ముందుగా తెరకెక్కించాల్సిన 'సలార్- 2' కు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాను పోస్ట్​పోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్​ సినిమాపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో 'సలార్​- 2'కు బ్రేక్ ఇచ్చి, 'ఎన్టీఆర్ 31' ప్రాజెక్ట్​ను ముందుకు తీసుకురానున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సలార్ టీమ్ రెస్పాన్స్ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్​కు కాస్త నిరాశే!

అయితే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పటికే ఖరారైంది. ఈ సినిమా ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే ఓ పోస్టర్ కూడా రిలీజైంది. 2024 మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతుందని గతంలో చెప్పారు. కానీ, ఆ పోస్టర్ మినహా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. చూడాలి మరి ప్రశాంత్ సలార్- 2 కంటిన్యూ చేస్తారా? లేదా అది పోస్ట్​పోన్ చేసి ఎన్టీఆర్ ప్రాజెక్ట్​ పట్టాలెక్కిస్తారా? దీనిపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వరుస ప్రాజెక్ట్​లు లైన్​లో పెట్టారు. ప్రస్తుతం ఆయన నాగ్​ అశ్విన్ డైరెక్షన్​ చేస్తున్న 'కల్కి AD 2898' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ దాదాపు షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కల్కి థియేటర్లలో సందడి చేయనుంది. దీని తర్వాత మారుతి 'రాజాసాబ్', సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' చేయనునున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా 'దేవర పార్ట్- 1', 'వార్- 2' ప్రాజెక్ట్​లతో బిజీగా ఉంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సలార్ 2​లో ఆమె 'గేమ్​ఛేంజర్' కాదట - అదంతా ఫేక్​! - Prabhas Salaar 2

టాలీవుడ్​లో సీక్వెల్స్​ పర్వం - మరీ ఆ రెండు సినిమాల సంగతేంటి ?

Last Updated : Apr 27, 2024, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.