ETV Bharat / entertainment

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్​ షురూ - పూజా కార్యక్రమాలతో లాంఛనంగా - Prashanth Neel NTR 31 - PRASHANTH NEEL NTR 31

Prashanth Neel NTR31: స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌- హీరో ఎన్టీఆర్‌ కాంబో సినిమా ఎట్టకేలకు మొదలైంది. నేడు(ఆగస్ట్ 9) పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

source ETV Bharat
Prashanth Neel NTR31 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 11:38 AM IST

Prashanth Neel NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్- స్టార్ డెరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR31' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోస్​లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా హాజరయ్యారు. ప్రశాంత్ నీల్ సహా సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో పాటు మేకర్స్​ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పనిలో పనిగా సినిమా విడుదల డేట్ కూడా అనౌన్స్ చేసేశారు.

NTR31 చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. NTR31 సినిమాకు టైటిల్ గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. కానీ, అయితే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తారనే టాక్ కూడా నడుస్తోంది.

పాన్ ఇండియా స్టార్​ తారక్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతుండడం వల్ల ఈ ప్రాజెక్ట్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా టైటిల్ నుంచి తారాగణం, కథ వరకూ ఎలాంటి క్లూస్ ఇవ్వకపోవడం చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంతో తెలుసుకోవాలని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఓ ఇంటర్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ '#NTRNeel' కోసం మునుపు తీసిన సినిమాల్లా కాకుండా కొత్త తరహా కథను ఎంచుకున్నట్లు తెలిపారు. భిన్నమైన భావోద్వేగాలతో చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నారు.

NTR Devara: మరోవైపు కొరటాల శివ దర్వకత్వంలో తారక్ నటిస్తున్న 'దేవర' చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

'NTR 31' సాలిడ్ అప్డేట్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడంటే? - NTR 31 Movie

20 ఏళ్లుగా ఎన్టీఆర్​కు ఫ్యాన్​ని.. కానీ: ప్రశాంత్ నీల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.