Prabhas Salaar dialogues : 'సలార్' సినిమా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసిన వారు మరోసారి, మిస్ అయిన వారు తొలిసారి చూసేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీలోకి(Salaar OTT) వచ్చిన తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం మొదలైంది. అదేంటంటే సలార్‌లోని ప్రభాస్ డైలాగ్స్.
ఈ మూవీలో ప్రభాస్ డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్న మాట తెలిసిన విషయమే. కానీ ఎంత లెన్త్, ఎంత నిడివి ఉన్నాయో అనేది స్పష్టత లేదు. అయితే ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ మొత్తం సినిమాలో డార్లింగ్ మాట్లాడిన డైలాగులన్నింటినీ ఒక చోటకు చేర్చి దాన్నో వీడియో క్లిప్‌గా మార్చి తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ నిడివి మొత్తం కేవలం నాలుగు నిమిషాల లోపే ఉంది. కొంచెం స్పీడ్ మోడ్‌లో పెడితే అది రెండున్నార నిమిషాలకు కుదించుకుపోతోంది. ప్రభాస్ కాస్త ఎక్కువగా డైలాగ్స్ చెప్పింది కేవలం సెకండాఫ్‌లోనే. అది కూడా పృథ్విరాజ్ సుకుమారన్‌తో మాత్రమే. ఆ తర్వాత డార్లింగ్ కాస్త మాట్లాడింది నటి ఈశ్వరిరావుతోనే. ఇక ఈ సినిమాలో కీలక పాత్రధారులైన శ్రేయ రెడ్డి, దేవరాజ్, బ్రహ్మాజీ తదితరులెవరితోనూ ప్రభాస్ సంభాషణలు లేవు.
ఏదేమైనా కమర్షియల్ సినిమా అంటే హీరోలు పంచ్ డైలాగ్స్ చెప్పడం సర్వసాధారణం. ప్రేక్షకులు, అభిమానులు కూడా తమ హీరోలు పంచ్ డైలాగ్స్ చెప్పాలని ఎక్కువగా కోరుకుంటుంటారు. కానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో చాలా తక్కువ డైలాగ్స్ చెప్పించి, కేవలం హీరోయిజం ఎలివేట్ చేసే ఫైట్స్, యాక్షన్ సీన్స్‌తో హిట్ కొట్టేశారు. ఇకపోతే సలార్ రెండో భాగం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లొచ్చని టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరో కీలక పాత్రలో నటించింది. చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
-
Prabhas Dialogue time in Salaar (sped up)
— Lok (@TeluguOchu) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA
">Prabhas Dialogue time in Salaar (sped up)
— Lok (@TeluguOchu) January 21, 2024
Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcAPrabhas Dialogue time in Salaar (sped up)
— Lok (@TeluguOchu) January 21, 2024
Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA
మహేశ్ కుమార్తె మంచి మనసు - అనాథలతో 'గుంటూరు కారం' చూసిన సితార
మహేశ్, రాజమౌళి మూవీ వర్క్స్ స్టార్ట్!- ఏడాదిలో పూర్తయ్యేలా బిగ్ ప్లాన్!