ETV Bharat / entertainment

పాకిస్థాన్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్- అంతా ఆ స్టార్ డైరెక్టర్ ప్లాన్! - Prabhas Pakistan Heroine - PRABHAS PAKISTAN HEROINE

Prabhas Pakistan Heroine: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' తో సినిమా ఇండస్ట్రీ బౌండరీలు చెరిపేశారు. దీంతో తన తర్వాత సినిమాలో ప్రభాస్, పాకిస్థాన్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేకుకోనున్నట్లు తెలుస్తోంది.

Prabhas Pakistan Heroine
Prabhas Pakistan Heroine (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 3:31 PM IST

Prabhas Pakistan Heroine: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్​వైడ్​గా రూ.1000కోట్లు వసూల్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్​లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల 'సీతారామం' ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపుడితో ఓ సినిమాకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.

అయితే ఈ ప్రాజెక్ట్​పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో పాకిస్థాన్ హీరోయిన్​తో హీరో ప్రభాస్ రొమాన్స్ చేయనున్నారని ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పాన్ఆసియా నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హీరోయిన్ సజల్ అలీని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, మైత్రి మూవీ మేకర్స్​ ఈ సినిమాను భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్​పై త్వరలోనే అఫీషియల్​ అనౌన్స్​మెంట్ రానుంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'కల్కి' సీక్వెల్​తోపాటు 'సలార్- 2', 'రాజాసాబ్', 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి. ఇందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్​రో రూపొందనుంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి 2025 సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, స్టార్ డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగతో చేస్తున్న స్పిరిట్ ఇంకా స్ట్రిప్ట్ వర్క్​ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్​ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ప్రభాస్ మినహ ఇతర నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 చివరికల్లా స్పిరిట్​ను థియేటర్లలో చూడవచ్చు.

ప్రభాస్ లైనప్​లో చిన్న మార్పు - ఆ స్టార్ డైరెక్టర్​ సినిమా వెనక్కి! - Prabhas Movies Lineup

'ప్రభాస్​కు అదంతా రొటీన్ - నాకు మాత్రం వెరీ స్పెషల్' - Kalki 2898 AD Amitabh Bachan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.