Kalki 2898 AD First Single Bhairav Anthem : కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్ది హైప్ పెరుగుతూ పోతోంది. ట్రైలర్ తర్వాత ఆ అంచనాలు మరింత భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో భైరవ ఆంథమ్ పేరుతో రెండు రోజుల క్రితం(జూన్ 15) ప్రోమోను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఒక నేనే నాకు చుట్టూ నేనే. ఒక్కటైనా ఒంటరోణ్ని కానే. స్వార్థము నేనే పరమార్థము, నేనే. వీరుడినే, యోధుడినే. భూమి నేనే సూర్యుడైన నేనే, నన్ను నేనే చుట్టి తిరుగుతానే, నేనే’ అంటూ సాగే ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో సాగుతోంది. నాకు నేనే కర్త, కర్మ, క్రియ. ఒక నేనే వేల సైన్యమయ్యా. నా గమనం నిత్య రణం, కణ కణ కణం, అనుచర గణం అంటూ సాంగ్‌లోని లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి, కుమార్ పాటను రచించగా దిల్జీత్ దోసాంజ్, దీపక్ బ్లూ ఆలపించారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచారు.
పంజాబీ స్టైల్లో సాగే ఈ పాట హూషారెత్తిస్తోంది. ఇందులో పంజాబీ లిరిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ పాటలో ప్రభాస్‍తో పాటు దిల్జీత్ కూడా ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. సాంగ్ మంచి బీట్‍తో ఆకట్టుకుంది. సంతోష్ నారాయణ్ ఈ పాటకు మంచి ట్రెండీ ఫాస్ట్ బీట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది.
కాగా, ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిన విషయమే. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమా రిలీజ్ కానుంది.