ETV Bharat / entertainment

'ప్రభాస్​కు అవన్నీ నచ్చవు- అందుకే పెళ్లి చేసుకోవడం లేదు' - Prabhas Marriage - PRABHAS MARRIAGE

Prabhas Marriage : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చాలా మందికి, ఆయన ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న విషయంపై ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి దాని వెనకున్న నిజాన్ని బయటపెట్టారు. ఇంతకీ అదేంటంటే?

Prabhas  Marriage
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 7:28 AM IST

Updated : Jun 12, 2024, 8:03 AM IST

Prabhas Marriage : టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అంటే చాలా మందికి ప్రభాస్‌ గుర్తొస్తారు. ఫ్యాన్స్‌ ముద్దుగా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, డార్లింగ్‌గా పిలుచుకునే ప్రభాస్‌కి చాలా ఇంటర్వ్యూలు, టీవీ షోస్‌లో 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?' అనే ప్రశ్న ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఎదురైంది.

అన్ని సందర్భాల్లో ప్రభాస్‌, ఏదో ఒక ఆన్సర్‌ చెప్పి తప్పించుకుంటుంటారు. ఇటీవల కూడా 'నా జీవితంలోకి ఓ స్పెషల్‌ పర్సన్‌ రాబోతున్నారు.' అంటూ ట్వీట్‌ చేస్తే సోషల్‌ మీడియాలో షేక్‌ అయిపోయింది. తీరా పెళ్లి గురించి కాదని, 'కల్కి 2898 AD' ప్రమోషన్స్‌ కోసం పోస్ట్‌ చేశారని తెలిసి ఫ్యాన్స్‌ నిరాశచెందారు. అయితే ప్రభాస్‌ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనే విషయాన్ని ఓ సారి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి రివీల్‌ చేశారు. ఆయన ఏం చెప్పారంటే?

"ప్రభాస్ చాలా బద్ధకస్తుడు, పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకం. ఒక అమ్మాయిని వెతికి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఇదంతా ప్రభాస్‌కి టూ మచ్‌ వర్క్‌. అందుకే అతను పెళ్లి చేసుకోవడం లేదు." అంటూ సరదాగా బదులిచ్చారు. 2018లో జరిగిన బాహుబలి ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ టాక్​ షోలో​ టాక్ షోలో పాల్గొన్నప్పుడు రాజమౌళి ఈ కామెంట్స్‌ చేశారు.

2019లో సాహో ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ ఇదే చెప్పారు. అక్కడ కూడా రాజమౌళి చెప్పిన అంశాలనే ప్రభాస్‌ రిపీట్‌ చేశారు. "లేజీ, షై, కొత్త వ్యక్తులను కలవలేను. నాకు ఈ మూడు ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ ఫీల్డ్‌కి ఎలా వచ్చానా? అని కూడా అనిపిస్తుంది." అంటూ ప్రభాస్ రివీల్ చేశారు.

అయితే తాను రియల్‌ లైఫ్‌లో మాత్రమే అలా షైగా ఫీల్‌ అవుతానని, కెమెరా ముందు మాత్రం అలా ఉండనని చెప్పారు. "సెట్‌లో, ఎక్కువ మంది ఉంటే కాస్త వర్రీ అవుతాను. లేదా ఎదుటివాళ్లు ఎక్కువ టేక్‌లు తీసుకుంటే, నేను కొంచెం ఆందోళన చెందుతాను. లేకపోతే ఆ ఫీలింగ్‌ ఏమీ ఉండదు." అంటూ ప్రభాస్‌ చెప్పారు.

'ప్రభాస్ అలాంటోడు' - కల్కి షూటింగ్ ఎక్స్​పీరియన్స్​పై దిశా పటానీ

అలనాటి అందాల తార - 18 ఏళ్ల తర్వాత ప్రభాస్ సినిమాతో తెలుగు తెరకు!

Last Updated : Jun 12, 2024, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.