ETV Bharat / entertainment

ప్రభాస్ కల్కిలో ఎన్టీఆర్​ - అసలు విషయం చెప్పేసిన మూవీ రైటర్! - Prabhas Kalki NTR

Prabhas Kalki NTR : ప్రభాస్ కల్కిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బదులిచ్చారు మూవీటీమ్​కు పనిచేస్తున్న ఓ రైటర్. సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. దాని గురించే ఈ కథనం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 11:02 AM IST

Prabhas Kalki NTR : ఇండియన్​ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న సినిమా కల్కి. ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఒకవేళ భారీ హిట్‌ అయితే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు బద్దలైపోతాయి. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్​, బోల్డ్ బ్యూటీస్​ దీపికా పదుకొణె, దిశా పటానీ, యూనివర్స్​ స్టార్ కమల్‌ హాసన్‌ మెయిన్‌ కాస్టింగ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. వీరితో పాటు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌, విలక్షణ నటుడు రానా, దర్శకధీరుడు రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ సహా పలువురు గెస్ట్​ రోల్​లో కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఈ స్టార్స్​తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అతిథి పాత్రలో నటించనున్నారని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఓ చిన్న కామియో రోల్​లో కనిపిస్తారని టాక్ వినిపించింది.

అయితే తాజాగా ఈ విషయంపై ఆన్సర్​ ఇచ్చారు ఈ మూవీకి స్క్రిప్ట్ రైటింగ్‌లో పనిచేస్తున్న ఫ్రీలాన్స్ రైటర్‌ కేశవ చంద్ర. సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటిస్తూ ఎన్టీఆర్ కామియోపై మాట్లాడారు. కల్కిలో తారక్ నటిస్తున్నారా అని ఓ నెటిజన్ అడగగా - మీరు సినిమాలోనే చూసి తెలుసుకోండి అంటూ బదులిచ్చారు. దీంతో పాటే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను తెలిపారు.

చిత్రంలో మైథలాజికల్ ఎలిమెంట్స్​ ఉంటాయని, రామాయణం, మహాభారతానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. అయితే సినిమాకు సంబంధించి క్రియేటివ్‌ వర్క్ విషయంలో మూవీటీమ్​తో చిన్న మనస్పర్థలు వచ్చాయని, అందువల్ల సినిమా గురించి ఎక్కువగా చెప్పలేనని అన్నారు. మూవీ సక్సెస్‌ తర్వాతే తాను మాట్లాడతానని చెప్పారు. స్క్రిప్ట్ పరంగా అయితే కథ వేరె లెవల్‌లో ఉంటుందని, ఇండియన్‌ మూవీ స్టాండర్డ్స్​ను గట్టిగా సెట్‌ చేసేలా మూవీ ఉంటుందని అన్నారు. మూవీలో కమల్‌ హాసన్‌ నటిస్తున్నారంటే కల్కి చిత్రం ఏ లెవల్​లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

కల్కిలోని ఓ డైలాగ్‌ను కూడా లీక్‌ చేశారు ఆయన. నాకు నేను ఏమీ కాదు, అస్సలు ఏమీ కాదు అనే సంభాషణను చెప్పారు. అయితే దీన్ని సినిమాలో వాడారో తెలీదని చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ప్రభాస్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తారక్ అభిమానులైతే ప్రభాస్‌ - ఎన్టీఆర్​ కలిసి కనిపిస్తే వెండితెర షేకే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొత్త వారం షురూ - ఈటీవీలోకి బోలెడు తెలుగు సినిమాలు - మీరేం చూస్తారు?

తెలుగు ఆడియెన్స్ - ఈ రెండు మలయాళ చిత్రాల గురించే చర్చంతా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.