ETV Bharat / entertainment

ఎట్టకేలకు ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ కన్ఫామ్ - వచ్చేది ఆ రోజే - Kalki 2898 AD Release Date

Prabhas Kalki 2898 AD Release Date : వాయిదా పడుతూ వస్తున్న ప్రభాస్ 'కల్కి' ఎట్టకేలకు రిలీజ్ డేట్​ను కన్ఫామ్ చేసుకుంది. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే?

ఎట్టకేలకు ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ కన్ఫామ్ - వచ్చేది ఆ రోజే

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 5:56 PM IST

Prabhas Kalki 2898 AD Release Date : వాయిదా పడుతూ వస్తున్న ప్రభాస్ 'కల్కి' ఎట్టకేలకు రిలీజ్ డేట్​ను కన్ఫామ్ చేసుకుంది. ఇండియా మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వరుసగా వస్తున్న మూవీ అప్‌డేట్‌లు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ఈ క్రమంలోనే మూవీ టీమ్‌ శనివారం లేటెస్ట్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ముందుగా ప్రచారం సాగిన ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా జూన్​ 27న ఈ సినిమా థియేటర్లలో రానున్నట్లు మూవీటీమ్​ అఫీషియల్​గా ప్రకటించింది. అలానే సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను షేర్‌ చేసింది. ప్రభాస్‌, దీపికా, అమితాబ్‌తో ఉన్న పోస్టర్‌ విడుదల చేయగా అది ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.

కల్కిలో టాప్‌ యాక్టర్లు - సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీతో, పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్కిలో ప్రభాస్‌ భైరవగా కనిపించనున్నారు. బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్ అశ్వత్థామగా నటించనున్నారు. ఇటీవల అశ్వత్థామగా ఉన్న అమితాబ్‌ గ్లింప్స్‌ను మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్‌ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇందులో మరో స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుండగా పశుపతి, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతోంది.

డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ రీసెంట్​గానే మూవీ విశేషాలు పంచుకున్నారు. మహాభారతంతో మొదలై, క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథతో కల్కీ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి, అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించామని, వాటిని భారతీయతని ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచామని పేర్కొన్నారు.

  • న్నికలే కారణమా? - ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్‌ కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మే 13న పోలింగ్‌ ఉంటుంది. ఎన్నికల కారణంగానే కల్కి సినిమాను ప్రొడ్యూసర్లు వాయిదా వేసినట్లు ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. ఏదేమైనా ప్రస్తుతం కొత్త రిలీజ్ డేట్ రావడంతో ఫ్యాన్స్​లో కొత్త జోష్ నెలకొంది.

'డ్రెస్‌ మార్చుకుంటుంటే అలా చేశారు' - నిర్మాతపై నటి సంచలన కామెంట్స్‌! - Krishna Mukherjee

పవర్​ స్టార్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​​ - ఎన్నికల ముందే ఆ సినిమా రిలీజ్​! - Pawankalyan Rerelease Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.