ETV Bharat / entertainment

'కల్కి'పై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్​ - ఆ స్థాయిలో లేరంటూ! - Prabhas Kalki 2898 AD - PRABHAS KALKI 2898 AD

Prabhas Kalki 2898 AD : ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్​ జోనాథన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 6:35 PM IST

Updated : Apr 9, 2024, 10:58 PM IST

Prabhas Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్​ జోనాథన్ కామెంట్స్ చేశారు. అలాగే ఆయన ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు.

"ఇండియన్ సినిమాల్లో లొకేషన్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయి. వారి స్టంట్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. నాకు సైన్స్‌ ఫిక్షన్‌ మూవీస్​ తెరకెక్కించడం అంటే చాలా ఇష్టం. అవి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేస్తాయి. కల్కి 2898 ఏడీ మేకర్స్‌ ప్రస్తుతం సలహా తీసుకునే స్థాయిలో లేరనే చెప్పాలి. వాళ్లు ఏం చేస్తున్నారో పక్కా క్లారిటీతో ఉన్నారు. అన్నీ ప్రాక్టికల్‌గా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇండియన్​ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్​ హాలీవుడ్‌ వారి కన్నా కూడా గొప్పగా పని చేస్తున్నారని నా అభిప్రాయం. ప్రతీ సీన్​ను క్లియర్‌గా చూపిస్తున్నారు" అంటూ జోనాథన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. వారు ఈ కామెంట్స్​ను సోషల్ మీడియాలో బాగా షేర్‌ చేస్తున్నారు.

ఇకపోతే 6,000 సంవత్సరాల మధ్య జరిగే కథతో కల్కిని తెరకెక్కిస్తున్నారు. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించి మరీ షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ మధ్యే దర్శకుడు నాగ్‌ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అన్నిట్లో భారతీయత కనిపించేలా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, రెబల్​ స్టార్​ ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె హీరోయిన్​గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ , యూనివర్సల్ స్టార్​ కమల్‌ హాసన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది.

రాజమౌళి - మహేశ్​ సినిమాలో మరో స్టార్ హీరో? - Rajamouli Mahesh Babu Movie

విజయ్ కోసం ఈ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో? - Gowtam Tinnanuri Vijay Devarakonda

Last Updated : Apr 9, 2024, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.