Kalki 2898 AD Bujji and Bhairava Trailer : తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఎడి. మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చేస్తూ మూవీటీమ్ హంగామా చేస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా ఆయనకు తోడుగా బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ రోబోటిక్ కారు కూడా సినిమాలో కనిపిస్తుంది. బుజ్జి - భైరవల మధ్య నడిచే ట్రాక్ సినిమాకే హైలెట్‌గా నిలవనుందని, సినీ లవర్స్‌ను కట్టిపడేయనుందని మూవీటీమ్ చెబుతోంది.
Kalki 2898 AD Animated Series : అలానే ఈ సినిమా రిలీజ్‌కు ముందే యానిమేషన్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. మే 31న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ప్రిల్యూడ్స్ పేరుతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యానిమేషన్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యానిమేషన్‌లోనూ యాక్షన్ డోస్ అదిరిపోయింది. భైరవ, బుజ్జిల బాండింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుందని ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్ధమవుతోంది.
కాగా, ఇతిహాసాలతో ముడిపడిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బోల్డ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. బుజ్జి కారుకు అందాల భామ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. గతం, భవిష్యత్ కాన్సెప్ట్‌తో మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో కథ సాగుతుందని మూవీటీమ్ చెబుతోంది. దీంతో ఈ యానిమేషన్ సిరీస్‌తో పాటు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, కల్కి 2898 ఎడి థియేట్రికల్ రిలీజ్ వరల్డ్ వైడ్‌గా జూన్ 27న భారీ స్థాయిలో కానుంది. చూడాలి మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో.
'కల్కి' ప్రీల్యూడ్స్కు OTT లాక్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - Kalki Prelude Videos
'కల్కి' రన్ టైమ్ ఫిక్స్! - ' దాని వల్లే అంత బడ్జెట్ అయ్యింది' - Kalki 2898 AD Movie