ETV Bharat / entertainment

'బాహుబలి' కాదు! - ప్రభాస్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఏంటో తెలుసా?

ప్రభాస్ నటించిన తొలి బాలీవుడ్ సినిమా! - 'బాహుబలి' తర్వాతే దానికి ఫుల్ క్రేజ్!

Prabhas First Hindi Movie
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 8:52 AM IST

Prabhas First Hindi Movie : రెబల్​ స్టార్ ప్రభాస్​కు ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్​గానూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో తెగ పాపులర్ అయ్యాయి. దీంతో 'బాహుబలి'కి ముందు సౌత్​కే పరిమితమైన ఆయన స్టార్​డమ్​ ఒక్కసారిగా నార్త్​లోనూ పెరిగిపోయింది. ఆయన లుక్స్, నటనకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కూడా బీటౌన్​లో ప్రభాస్ సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి.

అయితే అందరూ 'బాహుబలి'తోనే ప్రభాస్ బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అంతకంటే ముందే ఈ పాన్​ ఇండియా స్టార్ హిందీ తెరపై కనిపించారు. ప్రభుదేవా తెరకెక్కించిన యాక్షన్‌ జాక్సన్‌(2014) అనే సినిమాలో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిశారు. ఎనర్జిటిక్ స్టెప్పులేసి అదరగొట్టాడు. కానీ ఈ సినిమా వచ్చిన సమయంలో ప్రభాస్‌కి నార్త్​లో అంత గుర్తింపు లేదు. అందుకే అప్పుడీ ఈ కేమియో ఎవ్వరి కంట పడలేదు.

అయితే సరిగ్గా ఏడాది తర్వాత 'బాహుబలి'గా వచ్చి అందరినీ ఆకట్టుకుని అక్కడి టాప్ హీరోస్ సరసన చేరిపోయాడు. దీంతో ఆ తర్వాత యాక్షన్ జాక్సన్​ చూసిన చాలా మంది ప్రభాస్​ను గుర్తుపట్టి ఆ క్లిప్పింగ్స్​ను నెట్టింట తెగ ట్రెండ్ చేశారు.

ఆ బాలీవుడ్ డైరెక్టర్ అంటే డార్లింగ్​కు ఇష్టం!
ప్రభాస్ ఫేవరట్ డైరెక్టర్ల లిస్ట్​లో రాజమౌళి తర్వాత బాలీవుడ్‌ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరాణీ ఉన్నారు. ఆయన సినిమాలను డార్లింగ్ అమితంగా ఇష్టపడి చూస్తారు. ఆయన తీసిన 'త్రీ ఇడియట్స్', 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌' లాంటి సినిమాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక హాలీవుడ్‌లో దిగ్గజ నటుడు రాబర్డ్‌ డినీరో అన్నా అంతే ప్రభాస్​కు ఇష్టమట.

జస్ట్‌ ఓకే నుంచి సూపర్ హిట్ వరకూ
ఇక ప్రభాస్​కు తన తొలి సినిమా 'ఈశ్వర్‌'తోనే హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఫస్ట్ మూవీ అయినా కూడా తన యాక్టింగ్​తో అంతలా ఆకట్టుకున్నారు ప్రభాస్. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'రాఘవేంద్ర' కూడా అంతంత మాత్రంగానే రన్ అయ్యింది. దీంతో 'వర్షం' అనే మంచి ఫీల్‌గుడ్‌ లవ్​స్టోరీతో ప్రేక్షకులను పలకరించారు. మొదట్లో ఈ చిత్రానికి 'సినిమా జస్ట్‌ ఓకే' అనే కామెంట్‌ వినిపించింది. దీంతో ఇది కూడా ఫ్లాపేనా అంటూ నిరుత్సాహానికి గురయ్యారు. కానీ క్రమంగా 'వర్షం' కలెక్షన్లు వేగం పుంజుకున్నాయి. దీంతో విడుదలైన పది రోజులకే ఆ చిత్రం సూపర్‌హిట్‌ అందుకుంది. అలా ప్రభాస్ సక్సెస్​ఫుల్​గా సినిమాల్లోకి దూసుకెళ్లారు.

ప్రభాస్ బర్త్​ డే - ఆ రోజు ఫ్యాన్స్​కు 6 సర్​ప్రైజ్​లు!

PVCUలో ప్రభాస్ సినిమా - ప్రశాంత్ వర్మతో మూవీకి డార్లింగ్ ఓకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.