ETV Bharat / entertainment

రావణ బ్రహ్మగా ప్రభాస్! - ఏ సినిమాలో అంటే? - Prabhas as RavanaBramha

Prabhas As Ravana Brahma: త్వరలోనే 'కల్కి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​​ రావణ బ్రహ్మగా కనిపించబోతున్నారట. ఏ సినిమాలో అంటే?

source ETV Bharat
prabhas (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 1:50 PM IST

Prabhas As Ravana Brahma: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​గా 'కన్నప్ప' తెరకెక్కుతోంది. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్​లోనూ ఆయన కళ్ల వరకు చూపించారు. అయితే డార్లింగ్ పాత్ర ఏమనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన పాత్ర గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన పాత్ర గురించి కొత్త ప్రచారం మొదలైంది.

Prabhas Role In Kannappa Movie: 'కన్నప్ప'లో ప్రభాస్ కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. మొదట ఆయన శివుడి పాత్రలో కనిపిస్తారని అంతా అన్నారు. కానీ ఆ రోల్​ను అక్షయ్ కుమార్​ చేశారు. టీజర్​లోనూ ఆయన్ను శివుడిగా చూపించారు. అలానే ప్రభాస్​ను కూడా ఓ రెండు సెకన్ల పాటు చూపించారు. అది కూడా కేవలం కళ్లు మాత్రమే చూపించారు. నుదుట అడ్డంగా నామాలు, నిలువున ఎర్రటి నామంతో కనిపించారు ప్రభాస్​. పూర్తి ఫేస్​ను రివీల్ చేయలేదు. అయితే ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారని అంతా అన్నారు.

అయితే దీనిపై మంచు విష్ణు అండ్ టీమ్​ స్పందించలేదు. 'మేం ఒక పాత్ర అనుకుని దాన్ని ప్రభాస్​ చెయ్యాలని అడగడానికి వెళ్లాం. కానీ ఆయన మరొక పాత్ర చేస్తానని అన్నారు' అని మాత్రమే విష్ణు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రభాస్ రావణ బ్రహ్మగా కనిపించనున్నారట. ఆ మహా శివునికి కన్నప్ప ఎంతటి పరమ భక్తుడో రావణుడు కూడా అపర భక్తుడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా రావణ పాత్రనే ప్రభాస్ చేశారట. టీజర్​లో పూర్తి ఫేస్​ను రివీల్ చేస్తే రావణ బ్రహ్మ అనేది అర్థమవుతుందని చూపించలేదట. మరి ఇందులో నిజమెంతో పక్కాగా తెలీదు. చూడాలి మరి ప్రభాస్ క్యారెక్టర్​ను విష్ణు ఎప్పుడు రివీల్ చేస్తారో? లేదంటే డైరెక్ట్​గా థియేటర్లలో చూసి తెలుసుకోవాలో.

కాగా, 'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్​తో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల సహా పలువురు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్​పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. హిందీలో మహాభారత సిరీస్ తెరకెక్కించిన ముఖేశ్​ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది డిసెంబర్​లో సినిమాను రిలీజ్ చేయొచ్చు. పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం చేశారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీత సమకూరుస్తున్నారు.

భారీగా 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ - లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే! - Kalki 2898 AD Pre Release Event

'కల్కి' ఫస్ట్ రివ్యూ - టాక్​ ఎలా ఉందంటే? - Kalki 2898AD First Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.