ETV Bharat / entertainment

పూనమ్​ పాండే మృతిలో బిగ్ ట్విస్ట్​ - బతికే ఉన్నానంటూ కెమెరా ముందుకు నటి

Poonam Pandey Death Reason : పూనమ్ పాండే మృతి విషయంలో బిగ్ ట్విస్ట్​. ఆమె నిజంగానే చనిపోయిందా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతున్న సమయంలో పూనమ్​ కెమెరా ముందుకు వచ్చి అందరినీ మరోసారి షాక్​కు గురి చేసింది. తాను చనిపోయినట్లు ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చిందో వివరించింది.

పూనమ్​ పాండే మృతిలో బిగ్ ట్విస్ట్​ - బతికే ఉన్నానంటూ కెమెరా ముందుకు నటి
పూనమ్​ పాండే మృతిలో బిగ్ ట్విస్ట్​ - బతికే ఉన్నానంటూ కెమెరా ముందుకు నటి
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 12:30 PM IST

Updated : Feb 3, 2024, 1:10 PM IST

Poonam Pandey Death Reason : ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారన్న వార్త ప్రతిఒక్కర్ని షాక్‌కు గురి చేసిందన్న సంగతి తెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందని ప్రకటించడం అందర్నీ మరింత కలచివేసింది. దీంతో సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే తెగ కనపడుతున్నాయి. ఆమె మృతి వార్త బయటకు రావడంతో అందరూ RIP పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె మృతి విషయంలో మరో బిగ్ ట్విస్ట్​ చోటు చేసుకుంది. తాను బతికే ఉన్నానంటూ వీడియో బైట్​ను రిలీజ్​ చేసింది పూనమ్ పాండే. సర్వైకల్ క్యాన్సర్​పై అవగాహన కోసమే ఇలా చేశానంటూ వీడియోలో పేర్కొంది.

"హాయ్ నేను పూనమ్​ పాండే. ముందుగా ప్రతిఒక్కరికీ 'సారీ' మిమ్మల్ని బాధపెట్టినందుకు. నేను బతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్​పై అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశాను. మీ అందరితో ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. సర్వైకల్ క్యాన్సర్​ బారిన నేను పడలేదు. కానీ బాధకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధిపై ఎటువంటి అవగాహన లేక ఎన్నో వేల మంది మహిళలు ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రాణాంతకమైన రోగం పట్ల ప్రతి మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. అందరం కలిసి ఈ వ్యాధిని అంతం చేయడానికి కృషి చేద్దాం. దీనిపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిద్దాం" అని ఆమె రాసుకొచ్చింది.

ఇదీ జరిగింది : పూనమ్​​ మరణించింది అన్న వార్త రాగానే మొదట అందరూ షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత అందరిలోనూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఆమె నిజంగానే చనిపోయిందా? అనే చర్చ జోరుగా సాగడం మొదలైంది. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీలు కన్నుమూస్తే వారి ఇంటికి సహ నటులు, బంధుమిత్రులు వస్తారు. మీడియా కూడా అక్కడే ఉంటుంది. కానీ పూనమ్‌ పాండే ఇంటి దగ్గర అలాంటిదేమీ కనపడలేదు. ఆమె ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ మాట్లాడ లేదు. ఒకవేళ పూనమ్ పాండే నిజంగానే తుదిశ్వాస విడిచి ఉంటే ఆమె డెడ్‌బాడీ ఎక్కడుంది? అసలు సర్వైకల్ క్యాన్సర్‌ కోసం ఏ ఆస్పత్రిలో ట్రీట్మెంట్​ తీసుకుంది? సర్వైకల్ క్యాన్సర్‌ రాగానే అంత త్వరగా మరణిస్తారా? వంటి ప్రశ్నలు అందరి మదిలోనూ మెదిలాయి. ఇంత డిస్కషన్స్​ అవుతున్నా పూనమ్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా మౌనం పాటిస్తూనే వచ్చారు.

Poonam Pandey cervical cancer : దీంతో పూనమ్ పాండే మృతి వార్త కేవలం పబ్లిసిటీ స్టంటేనా? అన్న అనుమానాలు కూడా కలిగాయి. ఎందుకంటే ఆమె సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందని చెప్పినప్పటికీ ఆమెకు ఈ రోగం ఉన్నట్లు గతంలో ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ సడెన్​గా ఇప్పుడు అది సోకినా అంత సడెన్​గా కన్నుమూసే అవకాశం లేదు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్లు కొన్నేళ్ల పాటు బతికే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పూనమ్ పాండే మాత్రం ఒక్కసారిగా సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిందని అనౌన్స్​ చేయడం నమ్మకశ్యంగా లేదని అనడం మొదలుపెట్టారు. ఫైనల్​గా ఆమె బతికి ఉందని వీడియో బైట్​ రిలీజ్ చేయడంతో ఇదంతా పబ్లిసిటీ స్టంటా అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

తమన్నాతో పెళ్లి - వైరల్​గా మారిన విజయ్​ వర్మ ఆన్సర్​!

ఒకేసారి 2 OTTల్లో భయపెడుతున్న హారర్ ఫిల్మ్​ - మీరు చూడగలరా?

Last Updated : Feb 3, 2024, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.