ETV Bharat / entertainment

నాకు ప్రాణ హాని ఉంది, కాపాడండి : పొలిమేర 2 నిర్మాత ఫిర్యాదు - Polimera 2 Producer - POLIMERA 2 PRODUCER

Polimera 2 Producer Complaint : తనకు ప్రాణహాని ఉందంటూ పొలిమేర 2 నిర్మాత గౌరవ కృష్ణప్రసాద్‌ కంప్లైంట్ చేశారు. ఏం జరిగిందంటే?

source Getty Images
Polimera 2 (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 6:16 PM IST

Updated : Jul 23, 2024, 6:26 PM IST

Polimera 2 Producer Complaint : తనకు ప్రాణహాని ఉందంటూ పొలిమేర 2 నిర్మాత గౌరవ కృష్ణప్రసాద్‌ కంప్లైంట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి, అతడి టీమ్​పై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే రక్షణ కల్పించాలని కోరారు.

"వంశీ నందిపాటి, అతడి టీమ్​ మోసపూరిత కార్యకలాపాలు చేస్తోంది అని 2023 నవంబర్ 27న తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లైంట్ చేశాను. మరి ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో తెలీదు. అందుకే న్యాయం కోసం మళ్లీ కంప్లైంట్ చేస్తున్నాను. ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాను. ప్రసన్న కుమార్ ఛాంబర్‌ పవర్‌ను దుర్వినియోగం చేసి, నన్ను బెదిరిస్తున్నారు. నాతో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. వంశీ నందిపాటి, అతడి టీమ్‌ చంపేస్తామని బెదిరించారు.

నేను తెలుగు రాష్ట్రాల్లో పొలిమేర 2 డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్​ను ఓ అగ్రీమెంట్​ మేరకు వంశీ నందిపాటికి ఇచ్చాను. సినిమా రిలీజై, బ్లాక్‌ బస్టర్‌ అయింది. కానీ, ఇప్పటికీ నాకు వాటి లాభాల్లో వాటాను ఇవ్వలేదు. సినిమా రిలీజ్‌ టైమ్​లో సెక్యూరిటీ పరంగా నేను సంతకం చేసిన ఖాళీ చెక్కులు, పలు లెటర్‌ ప్యాడ్స్‌, బాండ్‌ పేపర్స్‌ వాటిని ఇప్పుడు ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. పైగా నాతో మాట్లాడకుండానే పొలిమేర 3ను అనౌన్స్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరో ప్రొడ్యూసర్​కు రాకూడదు. ఫిల్మ్‌ ఛాంబర్‌ నాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను." అని కంప్లైంట్​లో పేర్కొన్నారు.

పొలిమేర సినిమా భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని భోగేంద్ర గుప్తా నిర్మించారు. పొలిమేర 2ను గౌరీ కృష్ణ ప్రసాద్‌ శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్​పై నిర్మించారు. ఇప్పుడేమో పొలిమేర 3 సినిమాకు వంశీకృష్ణ నందిపాటి, ఆయన టీమ్​ ప్రొడ్యూస్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఈ అనౌన్స్​మెంట్ తర్వాత వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల కిత్రం తనను బెదిరిస్తున్నారని గౌవర కృష్ణ ప్రసాద్‌ కేపీహెచ్‌బీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

దేవర్​ నుంచి సూపర్ అప్డేట్​ - ఎన్టీఆర్​పై స్టార్​ కొరియోగ్రాఫర్​ ప్రశంసలు

ధనుశ్ 'రాయన్' సెన్సార్ టాక్ - ఎలా ఉందంటే? - Raayan Censor Review

Last Updated : Jul 23, 2024, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.