ETV Bharat / entertainment

హరిహర వీరమల్లు సీక్వెల్ అప్​డేట్​ - 'ఆ రూమర్స్ అన్నీ నిజం కాదు' - హరిహర వీరమల్లు సీక్వెల్

Pawan Kalyan Hari Hara Veeramallu Movie : పవర్​ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు గురించి తాజాగా ఓ సర్​ప్రైజింగ్ అప్​డేట్​ ఇచ్చారు నిర్మాత ఏఎమ్​ రత్నం. అంతే కాకుండా ఈ సినిమాపై వస్తున్న రూమర్స్​ అన్నింటికి క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan Hari Hara Veeramallu Movie
Pawan Kalyan Hari Hara Veeramallu Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 3:35 PM IST

Updated : Feb 27, 2024, 3:47 PM IST

Pawan Kalyan Hari Hara Veeramallu Movie : టాలీవుడ్ స్టార్ హీరో,పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ లీడ్​ రోల్​లో డైరెక్టర్ క్రిష్‌ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. పీరియాడికల్ డ్రామాగా తెరకెకుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. అయితే గత కొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్​డేట్స్ రాకపోవడం ఇక ఈ మూవీ ఆగిపోయిందంటూ నెట్టింట రకరకాల రూమర్స్‌ వినిపించాయి. అయితే ఈ చిత్ర నిర్మాత ఏఎమ్‌ రత్నం వాటన్నింటికీ చెక్ పెట్టారు. ఓ ఈవెంట్​లో ఆయన ఈ విషంపై క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన నయా అప్​డేట్​ను రివీల్ చేశారు.

"పవన్‌ కల్యాణ్​తో సినిమా తీసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్‌ తీసుకొని మేము ఏదోఒకటి తీయెచ్చు. కానీ, ఆయనతో తీసే సినిమా ఆడియెన్స్​కు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. దాని వల్ల ఆయనకు మంచి పేరు రావాలి. నేను తీస్తోన్న మొదటి పాన్‌ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్​ ఇక ఆగిపోయిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అందులో ఎటువంటి నిజం లేదు. దాన్ని మీరెవ్వరూ అస్సలు నమ్మకండి. 'హరిహర వీరమల్లు' ఆగిపోలేదు. దీనికి సీక్వెల్​ కూడా ఉంటుంది. ఈ సినిమాతో పవన్‌ మరో స్థాయికి వెళ్తారు" అంటూ నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది విన్న పవన్ ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. గతంలోనూ ఈ మూవీకి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇరాన్‌, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతున్నాయని అందువల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందంటూ ఓ స్టేట్​మెంట్ ఇచ్చారు . ఇవన్ని చూస్తుంటే ఈ సినిమా భారీ స్థాయిలో రానుందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Harihara Veeramallu Cast : ఇక సినిమా విషయానికి వస్తే - 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ మూవీలో పవన్‌ ఓ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నారట. ఈయనతో పాటు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్‌, బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్​కు వీరమల్లు టీమ్ సర్​ప్రైజ్​ - త్వరలో గ్లింప్స్​ రెడీ!

పవన్​ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డైలాగ్​ లీక్​- 'యానిమల్' విలన్ అంత పని చేశాడా!

Last Updated : Feb 27, 2024, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.