Akira Nandan Tollywood Entry : ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేవు! ఎందుకంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో ఉప్పొంగిపోతున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సంబరాలు, ఆనందాన్ని రెట్టింపు చేసే మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ గ్రాండ్ ఎంట్రీ.
వాస్తవానికి అకీరా వెండితెర అరంగేట్రంపై ఎప్పటి నుంచో చాలా వార్తలు వస్తున్నాయి. కానీ ఏదీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు మరోసారి అకీరా గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం చేస్తున్నారంటూ వార్త బయటకు వచ్చింది. అకీరా కోసం ఓ పాన్ ఇండియా లవ్ యాక్షన్ స్టోరీ సిద్ధం చేస్తున్నారట. ఓ ప్రముఖ బ్యానర్ దీన్ని నిర్మించబోతున్నారని తెలిసింది. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందని అంటున్నారు. కానీ ఇది ఎంతవరకూ నిజమో స్పష్టత తెలీదు. అయినప్పటికీ పవన్, మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఈ న్యూస్ మంచి జోష్ ఇస్తోంది. పైగా ఏపీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత చంద్రబాబు నుంచి మోదీ మీటింగ్ వరకు పవన్ ఎక్కడికెళ్లినా వెంట అకీరా కనిపిస్తూనే ఉన్నాడు. కాగా, అకీరాకు మొదటి నుంచి మ్యూజిక్‌పై మంచి ఇంట్రెస్ట్ ఉంది. అలానే ఎడిటింగ్‌పైనా ఉంది. మరి అకీరా హీరోగా రాణిస్తాడా ఇతర విభాగాల్లో కొనసాగుతాడా తెలియాల్సి ఉంది.
రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ - మోదీని అకీరా కలవడంపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నాకు ఎప్పటి నుంచో భాజపా అంటే ఎంతో అభిమానం ఉంది. మోదీ పక్కన నా కొడుకును చూస్తుంటే ఎంతో సంతోషంగా, ఎమోషనల్‌గా ఉంది. దీనిని మాటల్లో అస్సలు చెప్పలేను. మోదీని కలిశాక అకీరా నాకు ఫోన్ చేసి తన అనుభూతిని తెలిపాడు. మోదీ చాలా గొప్ప వ్యక్తి అని, తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు" అని అన్నారు రేణు దేశాయ్.
34 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్‌ను కలిసిన ఆ ముగ్గురు! - Megastar Chiranjeevi Viswambara
మహేశ్, రాజమౌళి సినిమా ఎక్కడి దాకా వచ్చిందంటే? - SSMB 29 Movie