Oscar Best International Film 2024: 96వ అస్కార్ అవార్డ్స్‌లో 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్' (The Zone Of Intrest) సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించింది. 2014లో మార్టిన్ అమిస్ రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు జోనాథన్ గ్లేజర్ హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కించారు. జర్మన్ నటులు క్రిస్టియన్ ఫ్రిడెల్, సాండ్రా హుల్లర్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ మూవీ 2023లో మే 19న జరిగిన 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఇటీవల జరిగిన బాఫ్టా వేడుకల్లో కూడా 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్' మూడు అవార్డులు గెలుచుకొని సత్తా చాటింది. ఇక నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ విడుదల చేసిన జాబితాలో టాప్ 5గా నిలిచింది. ఇటీవల జరిగిన బాఫ్టా (Bafta Awards) వేడుకల్లో మూడు అవార్డుల (ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్, ఉత్తమ సౌండ్, ప్లస్)ను గెలుచుకుంది. కాగా, తాజాగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది.
ఇక ఈసారి ఆస్కార్ బరిలో ఈ సినిమా ఐదు విభాగాల్లో నామినేట్ అయ్యింది. అందులో ది జోన్ ఆప్ ఇంట్రెస్ట్ రెండు కెటగిరీల్లో అవార్డు దక్కించుకుంది.ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు వరించాయి. ఇక 2024 ఆస్కార్‌లో అత్యధికంగా 'ఓపెన్‌హైమర్' సినిమాకు 7 అవార్డులు దక్కగా, 'పూర్ థింగ్స్'కు 4 విభాగాల్లో పురస్కారం లభించింది.
ఓపెన్‌హైమర్ దక్కించుకున్న అవార్డులు:
- ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్
- ఉత్తమ దర్శకుడు- క్రిస్టోఫర్ నోలన్
- ఉత్తమ నటుడు- కిలియన్ మర్ఫీ
- ఉత్తమ సహాయ నటుడు- రాబర్ట్ డౌనీ జూనియర్
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్- 'వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్' (What Was I Made For?)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ- ఓపెన్‌హైమర్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్- జెన్నిఫర్ లేమ్
పూర్ థింగ్స్‌ను వరించిన అవార్డులు:
- ఉత్తమ నటి (ఎమ్మా స్టోన్)
- బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్ట్రైల్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
2024 ఆస్కార్ అవార్డ్స్- బెస్ట్ పిక్చర్‌గా ఓపెన్‌హైమర్- ఉత్తమ డైరెక్టర్‌గా క్రిస్టోఫర్ నోలన్
2024 ఆస్కార్‌లో ఓపెన్ హైమర్ జోరు- బెస్ట్ యాక్టర్, డైరెక్టర్ సహా 7 అవార్డులు