ETV Bharat / entertainment

ఆపరేషన్ వాలెంటైన్ - మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్ అసలు పేరు ఇదా? - Varun Tej Full And Real Name

Operation Valentine Varun Tej Full And Real Name : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సౌత్ టు నార్త్ వరకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే ఆ ఇంటర్వ్యూల్లో వరుణ్ తేజ్ తన అసలు పూర్తి పేరును బయటపెట్టారు. దాని గురించే ఈ కథనం.

మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్ అసలు పేరు ఇదా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 6:39 AM IST

Updated : Feb 25, 2024, 8:49 AM IST

Operation Valentine Varun Tej Full And Real Name : మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ తనకంటూ ఓ ఇమేజ్​ను క్రియేట్ చేసుకున్నారు. ముకుంద చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచెతో మంచి సక్సెస్​ను అందుకున్నారు. అలా రెండో సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా ప్రిన్స్​ అనంతరం పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలోనే గత ఏడాది పెద్దల సమక్షంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట సినిమాలపై ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత రీసెంట్​గా లావణ్య మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. ఈ సిరీస్​కు ఓటీటీలో బాగానే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చేసింది. పెళ్లి తర్వాత ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్​గా నటించింది. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుణ్ తేజ్ ప్రమోషన్స్​లో జోరు పెంచారు. సౌత్ టు నార్త్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు.

అలా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ తన అసలు పూర్తి పేరును తెలిపారు. 'సాయి వరుణ్ తేజ్' అని చెప్పారు. స్క్రీన్ మీద పెద్దదిగా ఉంటుందని సాయిని మేకర్స్ తీసేశారని అన్నారు. పాస్‌పోర్టు సహా అన్ని సర్టిఫికేట్స్‌లో సాయి వరుణ్ తేజ్ అని ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అలా సాయి వరుణ్ తేజ్ కాస్త వరుణ్ తేజ్​గా మారింది. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీలో సాయి పేరుతో సాయి ధరమ్ తేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా విషయానికొస్తే - 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై ఎలా పగ తీర్చుకుంది అనే బ్యాక్​డ్రాప్​లో సినిమా ఉండబోతోంది. ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొడతారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వరుణ్ తేజ్ - లావణ్య ప్రత్యేక పూజలు చేసింది అందుకోసమేనా?

అకీరా న్యూ లుక్​ సూపర్ - ట్రెండ్ మొదలెట్టేశాడు!

Last Updated : Feb 25, 2024, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.