Nushrratt Bharuccha Shoe Collection : మనకే కాదు సెలబ్రిటీలకు ఒక్కో ఫ్యాంటసీ ఉంటుంది. ఒకరికి డ్రెస్‌లను కలెక్ట్ చేయడం ఇష్టమైతే మరొకరికి వాచ్ కలెక్షన్‌పై ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొకరికేమో కార్స్, బైక్స్‌పై మక్కువ ఉంటుంది. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం డిఫరెంట్‌గా చెప్పుల సేకరణ మొదలెట్టింది. ఆమెవరో కాదు ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా హిందీ ఛత్రపతిలో నటించిన బీటౌన్ బ్యూటీ నుష్రత్ భరూచా.
తన ఇంటిని క్లీన్ చేస్తున్న సమయంలో తన చెప్పుల కలెక్షన్‌ను చూసిన మురిసిపోయిన ఈ చిన్నది, వాటిన్నంటినినీ ఒక రూమ్‌లో అందంగా పేర్చి వాటి మధ్యలో కూర్చుని ఓ ఫొటో దిగింది. దాన్ని తన ఫ్యాన్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. 'నుష్ అండ్ హర్ షూ ఫ్యాక్టరీ' (తన షూ ఫ్యాక్టరీతో నుష్) అంటూ ఓ క్యూట్ క్యాప్షన్‌ను కూడా జోడించింది. ఆ ఫొటో చూస్తుంటే ఆమె దగ్గర దాదాపు వంద జతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది చూసిన ఫ్యాన్స్ ఈ ఫొటో గురించి నెట్టింట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 'ఈ అమ్మాయికి ఇదేం ఫ్యాంటసీ బాబూ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఆమె షూ కలెక్షన్ బాగుందంటూ తనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
-
Tag someone who loves shoes as much as #NushrrattBharuccha!👠❤️ pic.twitter.com/9b5Dk2Tm5n
— Filmfare (@filmfare) April 6, 2024
ఇక నుష్రత్ సినిమాల విషయానికి వస్తే - 'తాజ్ మహల్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నుష్రత్. తెలుగులో ఎంతో ట్రై చేసినప్పటికీ ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. దీంతో బీటౌన్లోకి అడుగుపెట్టింది. అక్కడ 'ప్యార్ కా పంచనామా 2', 'డ్రీమ్ గర్ల్', 'సోను కే టిటు కి స్వీటీ' లాంటి సినిమాలు ఆమెకు మంచి సక్సెస్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో ఆమె ఇప్పుడు బాలీవుడ్లో బిజీ స్టార్ అయిపోయింది. ఇక విజయవంతమైన చిత్రాలతో ఉత్తరాది వాసులకు దగ్గరైంది. ఇటీవలే హిందీలో రీమేక్ అయిన 'ఛత్రపతి' సినిమాలో నటించింది. చ్చోరీ 2 సినిమాలోనూ మెరిసింది. సినిమాల్లోనే కాకుండా ఈమె పలు టీవీ సీరియల్స్, మ్యూజిక్ వీడియోస్‌లోనూ కనిపించింది.
రూ. 31 కోట్ల బంగ్లా - సొంత ప్రొడక్షన్ హౌస్ - కృతి నెట్‌వర్త్ ఎంతంటే ? - Kriti Sanon Networth
ప్రైవేట్ జెట్, కాస్ట్లీ కార్లు - సౌత్‌లో రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే ?