ETV Bharat / entertainment

విడుదలకు ముందే దూసుకెళ్తోన్న 'దేవర' - ఆ రికార్డులన్నీ బ్రేక్​! - Devara Movie Records - DEVARA MOVIE RECORDS

NTR Devara Movie Records : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'దేవర' సినిమా విడుదల కాకముందే జోరు కొనసాగిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు మొదలుకొని బుకింగ్​ల వరకూ అన్నింటిలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source Getty Images
NTR Devara Movie Records (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 12:56 PM IST

NTR Devara Movie Records : పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. సెప్టెంబరు 27న గ్రాండ్​గా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్​లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్​ అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో తారక్​ లుక్, యాక్షన్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్​కు తెగ నచ్చేశాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూవీటీమ్​ మరో ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

అయితే ఈ సారి విడుదల చేయనున్న ట్రైలర్ కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్​కే కాదు అందరికీ నచ్చేలా మరింత పవర్ ఫుల్​గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబరు 22న హైదరాబాద్​లో జరగనున్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఈ రెండో ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్​గా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ విడుదల కాకముందే రికార్డు - దేవర చిత్రం ట్రైలర్ విడుదలకు ముందే అమెరికాలో రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారా 1మిలియన్ డాలర్లకు చేరిన తొలి భారతీయ చిత్రంగా అరుదైన రికార్డును దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం విడుదల ఇంకా 10రోజులు ఉండగానే అంటే ఇప్పుడు ఏకంగా 1.75 మిలియన్ డాలర్ల మార్క్​ను కూడా టచ్​ చేసేసింది దేవర.

టాప్ 25లో నాలుగు స్థానాలు దేవరనే - దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్​లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్​. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె(తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్​లో చోటు దక్కించుకోవడం విశేమనే చెప్పాలి.

పుష్ప2 ను మించేలా - విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3లక్షల 36వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది.

ఇక దేవర సినిమా విషయానికొస్తే జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో తారక్ సరసన అలనాటి తార నటి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్- టైమ్, డేట్ ఫిక్స్! - Devara Pre Release Event

చిన్న సినిమాలతో భారీ సక్సెస్ - ఈ వారం థియేటర్లలో అదరగొట్టిన చిత్రాలివే! - Latest movies with low budget

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.