ETV Bharat / entertainment

వాట్​ ఏ ప్లానింగ్ 'దేవర' - ఆయన చేతికి నార్త్ థియేట్రికల్ రైట్స్​ - NTR Devara

NTR Devara North Theatrical Rights : ఎన్టీఆర్ దేవర నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్​ రైట్స్​ను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత దక్కించుకున్నారు. ఆ వివరాలు.

వాట్​ ఏ ప్లానింగ్ దేవర - ఆయన చేతికి నార్త్ థియేట్రికల్ రైట్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 3:59 PM IST

Updated : Apr 10, 2024, 5:20 PM IST

NTR Devara North Theatrical Rights : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ దేవర. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్​ మూవీ నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్​ రైట్స్ గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ద‌క్కించుకున్నారు.

2015లో రానాతో ఉన్న స్నేహంతో పాటు రాజమౌళి సినిమా మీద నమ్మకంతో బాహుబలి హిందీ వెర్షన్​ను తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేశారు కరణ్ జోహార్​. ఆ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో ఇప్పుడు అదే నమ్మకంతో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్​ను కూడా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో పాటు AA ఫిల్మ్స్ కూడా దక్కించుకుంది.

"ఈ సినిమా నార్త్ ఇండియా థియేటర్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పార్టనర్ షిప్ అనౌన్స్ చేస్తున్నందుకు, ఒక మంచి సినిమా అనుభవాన్ని అందరికి ఇవ్వగలుగుతున్నందుకు మాకు చాలా గర్వంగా, థ్రిల్​గా ఉంది" అంటూ కరణ్ జోహార్ తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

కాగా, సీ కాన్సెప్ట్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా వస్తుందని చిత్ర బృందం ముందే ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.120 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ఎన్టీఆర్ అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అజయ్​ దేవగణ్ స్పోర్ట్స్ డ్రామా మైదాన్ - ఓ అద్భుతం - Maidaan Movie review

'పెళ్లి కన్నా ముందు సహజీవనం చేయండి' - యూత్​కు స్టార్ నటి సలహా! - Zeenat Aman

Last Updated : Apr 10, 2024, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.