ETV Bharat / entertainment

'దేవర' బిజినెస్ డీటెయిల్స్ ఇవే​ - భారీ స్థాయిలో టికెట్ ప్రీ సేల్స్​! - NTR Devara Movie - NTR DEVARA MOVIE

NTR Devara Movie : దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ కూడా విడుదలైంది. అయితే సినిమా విడుదలకు ముందు రికార్డ్​ స్థాయిలో ప్రీ సేల్స్​ జరుగుతున్నాయి. అలానే సినిమా బిజినెస్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి! పూర్తి వివరాల స్టోరీలో.

source ETV Bharat
NTR Devara Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 11:07 AM IST

NTR Devara Movie Trailer : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న 'దేవర' సినిమా రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్, హిట్ డైరక్టర్ కొరటాల శివ కాంబో అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా ట్రైలర్ విడుదలై మరింత హైప్​ను పెంచింది. పైగా బాలీవుడ్ భామ, శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే కోట్లలో బిజినెస్ చేస్తున్నాడు 'దేవర'.

Devara Overseas Pre Sales : ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో యూఎస్ మార్కెట్​లో దేవరకు మంచి బజ్​ క్రియేట్ అయింది. నార్త్ అమెరికాలో అయితే ఇప్పటికే టికెట్ ప్రీ సేల్స్​లో మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. ట్రైలర్ విడుదలకు ముందే ఈ స్థాయిలో టిక్కెట్ విక్రయాలు జరగడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే తొలిసారి. ఇకపోతే సినిమా రిలీజ్​కు మరింత సమయం ఉండడంతో టికెట్స్​ మరింత భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయట. అలా ఇప్పుడు యూఎస్​ఏ ప్రీమియర్స్ సేల్స్​లో ఏకంగా 30 వేలకు పైగా టిక్కెట్లు బుక్ అయ్యాయని తెలిసింది.

Devara Theatrical Rights : దేవర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ.95 కోట్ల వరకు జరిగిందని సమాచారం. ఆంధ్ర(సీడెడ్ కాకుండా), తెలంగాణ నైజాం ఏరియాలో రూ.53కోట్లు, రూ.42కోట్లుగా అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. కాగా, రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న దేవరలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారని అర్థమైపోయింది. తీర ప్రాంతంలో జరిగే కథ ఇది. తారక్ తండ్రీ కొడుకు పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత పూర్తి ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది 'దేవర'. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌తో పాటు ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, అజయ్, షైన్ టామ్ చాకోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర పాటలు సోషల్ మీడియా యూట్యూబ్​లో తెగ ట్రెండ్ అవుతూ శ్రోతలను తెగ ఆకట్టుకుంటున్నాయి.

'అండర్​ వాటర్​లో 38 రోజులు షూట్​ చేశాం - ఆ 40 నిమిషాలు డోంట్ మిస్​​' : ఎన్టీఆర్ - Devara Movie

'దేవర' ట్రైలర్ వచ్చేసిందహో - ఎన్టీఆర్ మాస్ ఊచకోత - గూస్ బంప్సే - Devara Movie Trailer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.