ETV Bharat / entertainment

పవర్​ఫుల్​ టైటిల్​తో 'NTR 31' - బర్త్​డే రోజు రివీల్! - JR NTR PRASANTH NEEL MOVIE - JR NTR PRASANTH NEEL MOVIE

NTR 31 Title : మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్​టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్​లో రానున్న NTR 31 మూవీ కోసం ఓ పవర్​ఫుల్ టైటిల్​ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇంతకీ అదేంటంటే?

NTR 31 Title
NTR 31 Title (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 6:55 AM IST

NTR 31 Title : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్​టీఆర్ బర్త్​డే కౌంట్​డౌన్​ మొదలైంది. దీంతో ఫ్యాన్స్ తన కొత్త మూవీస్​కు సంబంధించిన అప్​డేట్స్​ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మూవీ యూనిట్స్​ కూడా ఎన్​టీఆర్ బర్త్​డే కోసం పలు స్పెషల్స్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే 'దేవర' నుంచి రానున్న ఫస్ట్ సింగిల్​కు మరింత హైప్ పెరిగిపోగా, ఇప్పుడు మరో ఆయన అప్​కమింగ్ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అదేంటంటే జూనియర్ ఎన్​టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్​లో రానున్న 'NTR 31' మూవీ కోసం ఓ పవర్​ఫుల్ టైటిల్​ను ఫిక్స్ చేశారట మేకర్స్. 'డ్రాగన్' అనే పేరులో పరిశీలనలో ఉంచారని, దాదాపు అదే ఫిక్స్ చేయనున్నారట. ఇక ఎన్​టీఆర్ బర్త్​డే కోసం ఓ ప్రీ లుక్ పోస్టర్​ను విడుదల చేయనున్నారట. ఒకవేళ అప్పటికి టైటిల్ ఫిక్స్ అయితే దాన్ని కూడా మేకర్స్ అదే పోస్టర్ ద్వారా రివీల్ చేయనున్నట్లు సినీ వర్గాల టాక్.

ఇదిలా ఉండగా, త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌కు ఫైనల్‌ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. ఇందులో భాగంగా మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. తారక్ ప్రస్తుతం వరుస షూటింగుల్లో బిజీగా ఉన్నందున ఆ చిత్రీకరణ పూర్తయ్యాకనే 'ఎన్​టీఆర్​ 31' సెట్స్​పైకి వెళ్లే ఛాన్స్​లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ సినిమా షూటింగ్​ ప్రారంభం కానుందని సమచారం.

'ఆర్​ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్​టీఆర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దేవర, వార్​ 2 ఇలా ఈయన లైనప్ కూడా క్రేజీగా ఉండటం వల్ల అభిమానులు తన అప్​కమింగ్ మూవీస్​పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దేవరతో పాటు వార్​ షూటింగ్​లో సందడి చేస్తున్నారు. రెండింటికీ తన కాల్షీట్స్​ను అడ్జెస్ట్ చేసుకుని బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు.

'దేవర ముంగిట నువ్వెంత?, పక్కా హుకుమ్​ పాటను మర్చిపోతారు'- NTR నెక్ట్స్ లెవల్ మాస్! - Devara first single

'దేవర'లో ఐటమ్ సాంగ్- స్టార్ హీరోయిన్​ కన్ఫార్మ్! - Devara Item Song

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.