ETV Bharat / entertainment

ఎన్టీఆర్‌ హనుమంతుడి పాత్ర ఎందుకు పోషించలేదంటే? - NTR 101 Birth Anniversary

NTR 101 Birth Anniversary : తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. తన కెరీర్​లో ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించన ఆయన నారదుడి, హనుమంతుడి పాత్ర మాత్రం పోషించలేదు. అందుకు గల కారణాన్ని ఓ సందర్భంలో ఎన్టీఆరే స్వయంగా చెప్పారు.

Source ETV Bharat
NTR 101 Birth Anniversary (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 2:19 PM IST

NTR 101 Birth Anniversary : రాముడు, కృష్ణుడు అంటే టక్కున తెలుగువారి మదిలో మెదిలే ఒకే ఒక్క రూపం నందమూరి తారక రామారావు. అంతలా ఆయన ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. రూపంలో నిండుగా కనిపించేవారు. ఇంకా చెప్పాలంటే పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. సం భాషణలు, హావ భావాలు పలికించడంలో ఆయనకు మరెవరు సాటి రారు. అందుకే రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, రావణుడిగా ఇలా ఎన్నో పాత్రల్లో ఆయన నటించి ఒదిగిపోయారు. అయితే ఈ పాత్రల్లో కృష్ణుడిగా అత్యధిక సార్లు కనిపించి రికార్డు కూడా క్రియేట్ చేశారు. మరి పౌరాణిక పాత్రలకు నిఘంటువు అనే ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రామారావు తన కెరీర్​లో నారదుడు, హనుమంతుడి పాత్రలను మాత్రం పోషించలేదు.

అయితే ఆ పాత్రలు ఎందుకు పోషించలేదో ఓ సందర్భంలో ఎన్టీఆర్​ ఇలా చెప్పారు. "నారదుడి పాత్ర పోషించడానికి ఆలోచించాను. అయితే హాస్యంలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శన చేయొచ్చు. కానీ అందుకు నా రూపం సహకరించదని అనిపించింది. అందుకే సాహసం చేయలేదు. పైగా నారదుడు అంటే ఇలానే ఉండాలి అనేలా ఓ రూపానికి అందరూ అలవాటు పడ్డాం.

అందుకే నా శరీరం కాస్త భారీగా ఉంటుందని ఆ ఆలోచనను పక్కనపెట్టాను. అదే రంగారావు గారిని నారదుడి పాత్రలో ఊహించగలమా? మా పర్సనాలిటీలు సెట్​ అవ్వవు. ఇక హనుమంతుడు పాత్ర విషయానికొస్తే అది నా ముఖం కానప్పుడు నాకెందుకా పాత్ర? నటిస్తే మాస్క్‌తో నటించాలి. ఫిజికల్‌ మూవ్‌మెంట్స్‌‌ కూడా ఎక్కువ ఇవ్వాలి. అది కుదరదు" అని రామారావు చెప్పుకొచ్చారు.

కాగా, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో సిల్వర్​ స్క్రీన్​పై ఎన్టీఆర్‌ తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. సినీ రంగంలో తిరుగులేని ధ్రువతారగా, రాజకీయ రంగంలో అశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే నేడు ఆయన 101వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ తారల వరకు అందరు ఆయన్ను స్మరించుకుంటున్నారు.

ఈ రికార్డ్​ ఎన్టీఆర్‌కే సాధ్యం? - అంతమంది దర్శకులతో పనిచేశారా? - NTR 101 Birth Anniversary

నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ - కొత్త సినిమా నుంచి క్రేజీ వీడియో రిలీజ్ - NTR 101 Birth Anniversary

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.