NBK 50 Years Celebrations : నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సినీ పరిశ్రమ మొత్తం ఒక్కటై సినీ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దీనికి సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు తరలివచ్చి, బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
"బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఓ వేడుక. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్‌కు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా దానికి తప్పకుండా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేమంతా ఓ కుటుంబంలాంటి వాళ్లం, ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా" అంటూ చిరంజీవి అన్నారు.
GOD OF MASSES On Stage - అభిమానులకు సింహం అభివాదం🔥#NandamuriBalakrishna #NBK50InTFI pic.twitter.com/pYX3ecMNAZ
— manabalayya.com (@manabalayya) September 1, 2024
The man of the moment, Natasimham #NandamuriBalakrishna, takes the stage alongside his blockbuster directors at the grand #NBK50YearsCelebrations. ✨ 💥#NandamuriBalakrishna #NBK pic.twitter.com/tR5JOC3RUp
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 1, 2024
"తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం ఎంతో కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు మీకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరిలా సినిమాలు చేయాలి. మేమంతా మీతోనే ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఎక్కడా ఉండదు. ఎవరు సాయం కోసం వచ్చినా ఆయన నిలబడతారు" - డైరెక్టర్ బోయపాటి శ్రీను
"బాలకృష్ణ నాకు సహోదరుడి లాంటివారు. ఆయనతో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఒకప్పుడు మేమంతా చెన్నైలో కలిసి ఉండేవాళ్లం. మీరు ఇలాగే 100 ఏళ్ల వేడుకలు కూడా చేసుకోవాలి" - కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్
"చిన్నప్పటి నుంచీ నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు బాలయ్య. 500 రోజులకుపైగా సినిమా థియేటర్లలో రన్ అయ్యే ఘనత ఆయనదే. హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలవడం సంతోషం" - టాలీవుడ్ హీరో మోహన్ బాబు
"నేను బాలయ్య గారితో రెండు సినిమాలలో నటించాను. ఆయన నాకు తెలిసినంత వరకూ చాలా సింపుల్. మనస్ఫూర్తిగా మాట్లాడతారు. ఆయన జర్నీ ఎంతో ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" - సీనియర్ నటి సుమలత
"ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలకృష్ణ. ఆయనకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. 50 సంవత్సరాల మీ ప్రయాణం ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కు ఆదర్శం" - విక్టరీ వెంకటేశ్
"మీ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే అది నాన్న గారు(మోహన్‌బాబు), బాలయ్య అంకుల్ వల్లే. బాలకృష్ణ చాలా అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచ్ఛమైంది. వైద్య రంగంలో ఆయన చేసినంత సేవ ఇంకెవరూ చేయలేనిది" - మంచు విష్ణు
"సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు అన్నీ
ఎన్టీఆర్. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బాగుండాలి" - తమిళ నటుడు కమల్ హాసన్ వీడియో మెసేజ్
"బాలయ్య నటన, ఆయన చేస్తున్న సేవ చూస్తూనే పెరిగాను. నాకు తెలిసిన వాళ్లు చాలామంది ఆయన నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. 'లైగర్' సినిమా షూటింగ్‌లో ఆయన్ను తొలిసారి కలిశాను" - రౌడీ హీరో విజయ్ దేవరకొండ
"బాలయ్య బాబు గారి గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుంచే పుట్టేస్తాయ్, బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తాయి. ఓ నటుడిగా, ఓ రాజకీయ నాయకుడిగా, అలాగే మానవత్వం ఉన్న మనిషి ఇలా అనేక రూపాల్లో ఉండటం ఆయనకే సాధ్యం" - డైరెక్టర్ అనిల్ రావిపూడి
"బాలకృష్ణను కలవడమే కాదు ఆయన్ను దగ్గరగా చూసినా ఇష్టపడతాం. సర్ మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలి" - నేచురల్ స్టార్ నాని
"బాలకృష్ణ యాక్ట్ చేసిన ఓ సినిమా విడుదలైన రోజు పుట్టా అందుకే ఇలా అల్లరి చేస్తుంటా" - టాలీవుడ్ హీరో రానా
"ఈరోజు ఇంతకంటే మంచి మాట, గొప్ప మాట ఇంకొకటి ఉండదు. జై బాలయ్య" -డైరెక్టర్ బుచ్చిబాబు
"కలిసిన 5-6 సార్లు కూడా నేను చూసింది ఏంటంటే బాలయ్య గారు ఎవరినైనా నిజాయితీగా ఉంటే తప్పకుండా ఇష్టపడతారు. మీ అనుభవం అంతలేదు నా వయసు. మీరే నాకు స్ఫూర్తి"- సిద్ధు జొన్నలగడ్డ
"బాలకృష్ణ గారు చాలా సరదా మనిషి. 50 ఏళ్ల వేడుకలు జరుపుకోవడం సంతోషం" - అల్లరి నరేశ్
"చిన్నప్పుడు మేము మీ పాటలకు డ్యాన్స్ చేసే వాళ్లం. ఈ రోజు మీ గురించి ఇలా మాట్లాడటం చాల సంతోషం" - అడవి శేష్
ఆమెనే నాకు బెస్ట్ ఫ్రెండ్- మా ఇంట్లో అంతా 'వసుంధర'దే : బాలకృష్ణ - Nandamuri Balakrishna Family