Nayanthara Wedding Documentary : లేడీ సూపర్ స్టార్ నయనతార- డైరెక్టర్ విఘ్నేష్ శివన్ మ్యారేజ్ డాక్యుమెంటరీ ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. దీపావళి శుభ సందర్భంగా స్ట్రీమింగ్ డేట్‌ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' ( Nayanthara : Beyond the Fairy Tale) పేరుతో 2024 నవంబర్ 18న స్ట్రీమింగ్ కానుంది. దాదాపు 1 గంట 21 నిమిషాల నిడివి ఉంటుంది. దీని స్ట్రీమింగ్ హక్కులను పొందేందుకు నెట్‌ఫ్లిక్స్ పెద్ద మొత్తంలో వెచ్చించిందని తెలుస్తోంది.
నయనతార- విఘ్నేష్ శివన్ వివాహమైన దాదాపు రెండేళ్లకు డాక్యుమెంటరీ రిలీజ్ అవుతోంది. నయనతార, విఘ్నేష్ శివన్ 2015లో 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సందర్భంగా మొదటిసారి ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ పరిచయంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2021లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022 జూన్‌లో ఈ జంట మహాబలిపురంలోని ఓ ఖరీదైన రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. 2022 అక్టోబర్‌లో నయనతార సరోగసీ ద్వారా కవలు మగబిడ్డలు ఉలగ్, ఉయుర్కు జన్మనిచ్చింది.
అప్పుడు భారత్‌లో సరోగసీకి సంబంధించిన నిబంధనలను ఈ జంట అతిక్రమించిందని ఆరోపణలు వచ్చాయి. పెళ్లైన కొన్ని నెలలకే సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా విచారణ జరుపుతామని పేర్కొంది. చివరికి నయనతార, విఘ్నేష్ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని తమిళనాడు ప్రభుత్వం ఓ నివేదికలో స్పష్టం చేసింది. మ్యారేజ్ డాక్యుమెంటరీలో కవల పిల్లల జననం, దీనికి సంబంధించి జరిగిన వివాదం కూడా ఉంటుందని తెలిసింది.
కాగా, నయనతార చేతిలో ప్రస్తుతం 'ది టెస్ట్', 'మన్నంగట్టి సిన్స్ 1960' రెండు సినిమాలు ఉన్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. నటుడు కవిన్‌తో ఓ సినిమా తీయాల్సి ఉంది. అలాగే మలయాళంలో నివిన్ పౌలీతో 'డియర్ స్టూడెంట్స్', 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే సినిమాలు రాబోతున్నాయి.
ప్రైవేట్ జెట్, కాస్ట్లీ కార్లు - సౌత్‌లో రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే ?
'అందుకే నా మొఖంలో మార్పు' - ప్లాస్టిక్ సర్జరీపై మాట్లాడిన నయనతార