Naveen Polishetty Hand Fracture : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తాజాగా అమెరికాలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చేతి ఫ్రాక్చర్ అవ్వగా, ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ను డిఫరెంట్‌గా ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు. అందులో ఆయన చేతికి పట్టీ ధరించి ఉండగా, సింగిల్ హ్యాండ్ వల్ల ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను ఫన్నీగా చూపించారు. తనను తాను సెల్ఫ్ ట్రోల్ చేస్తూనే అభిమానులను నవ్వించేందుకు ప్రయత్నించారు.
ఈ వీడియోలో ఆయన టీవీ చూస్తూ అందులో వచ్చే సినిమా డైలాగ్స్‌కు రిలేట్ చేస్తూ కనిపిస్తారు. 'గణేశ్' మూవీలో విలన్‌ను బెదిరించేందుకు వెంకటేశ్ వాడే సింగిల్ హ్యాండ్ డైలాగ్, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి చెప్పే చేయి డైలాగ్ ఇలా పలు ఆసక్తికరమైన క్లిప్స్‌ను తన పరిస్థితికి రిలేట్ అయ్యేటట్లు ఫన్నీగా చూపించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవ్వగా, నెటిజన్లు ఈయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గాయంలోనూ ఆయన కామెడీ టైమింగ్ మారలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
NEW VIDEO. Life oka zindagi aipoyindi 😜 See you soon JaaneJigars ❤️ pic.twitter.com/6sNZ4L7nt4
— Naveen Polishetty (@NaveenPolishety) August 3, 2024