ETV Bharat / entertainment

'సరిపోదా శనివారం' కలెక్షన్స్- 3 రోజుల్లోనే రూ.50 కోట్లు వసూల్ - Saripodhaa Sanivaaram - SARIPODHAA SANIVAARAM

Saripodhaa Sanivaaram Collection: నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన సినిమా 'సరిపోదా శనివారం'. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజై మంచి విజయం అందుకుంది. రిలీజైన మూడు రోజులకే ఈ సినిమార రూ.50కోట్ల మార్క్ అందుకుంది.

Saripodhaa Sanivaaram
Saripodhaa Sanivaaram (Source: ETV Bhatat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 3:31 PM IST

Updated : Sep 1, 2024, 3:51 PM IST

Saripodhaa Sanivaaram Collection: నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా సూపర్ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది. ఇక వీకెండ్​లో అన్ని సెంటర్లలో దాదాపు ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా రన్​ అవుతోంది.

అయితే ఓపెనింగ్​ రోజు నుంచే భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.50కోట్ల మార్క్ దాటింది. 'సరిపోదా శనివారం' సినిమా మూడు రోజుల్లో వరల్డ్​వైడ్​గా రూ 52.18కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ అఫీషియల్​గా ప్రకటించారు.

భారత్​లో కలెక్షన్లు (నెట్) - రూ. 24 కోట్లు (అంచనా)

టికెట్ సేల్స్​లోనూ జోరు
అయితే ట్రైలర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఓపెనింగ్ రోజు మంచి టాక్ రావడం వల్ల టికెట్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. తొలి రోజు లక్షా 91వేల టికెట్లు అమ్ముడవగా, రెండో రోజు లక్షా 94వేల టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఇక ఈ వీకెండ్​లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ మూడో రోజైన శనివారం టికెట్ అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. మూడో రోడు ఏకంగా 2లక్షల 4వేల టికెట్లు అమ్ముడైనట్లు బుకింగ్ సంస్థ బుక్ మై షో (Book My Show) తెలిపింది. ఇక నాలుగో రోజు కూడా ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.

ఓవర్సీస్​లోనూ హవా
ఇక ఓవర్సీస్​లోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీ ఆదివారం అమెరికాలో బ్రేక్​ఈవెన్ మార్క్ దాటినట్లు మేకర్స్ ప్రకటించారు. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.6మిలియన్ డాలర్లు వసూల్ చేసినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.

కాగా, ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్​గా నటించింది. సీనియర్ డైరెక్టర్, నటుడు యస్ డే సూర్య కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్రకు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా రూపొందించారు.

15రోజులు మాకు నిద్ర లేదు: సక్సెస్​మీట్​లో నాని - Saripodhaa Sanivaaram

'కల్కి' సీక్వెల్​లో నాని - క్లారిటీ ఇచ్చిన నేచురల్‌ స్టార్‌ - Saripoda Sanivaram Nani Kalki 2898

Last Updated : Sep 1, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.