ETV Bharat / entertainment

ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటు నాటు'- టాలీవుడ్ రేంజ్​ అట్లుంటది మరి - Natu Natu Song Oscar Stage 2024

Natu Natu Song Oscar Stage 2024: ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్ వేదికపై తెలుగు బ్లాక్​బస్టర్ నాటు నాటు పాట మరోసారి సందడి చేసింది. 2024 ఆస్కార్ వేడుకల్లో ఆర్​ఆర్​ఆర్​ సినిమా విజువల్స్​ బ్యాక్​గ్రౌండ్​ స్క్రీన్​లో ప్లే చేశారు.

Natu Natu Song Oscar Stage 2024
Natu Natu Song Oscar Stage 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 11:40 AM IST

Updated : Mar 11, 2024, 12:23 PM IST

Natu Natu Song Oscar Stage 2024: 96వ ఆస్కార్ అవార్డ్స్​ ఈవెంట్ లాస్ ఏంజిల్స్​లోని డాల్బీ థియేటర్‌లో గ్రాండ్​గా జరిగింది. ఈ అవార్డుల వేడుకకు ప్రపంచంలోని వివిధ దేశాల నటీనటులు, సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఆయా కేటగిరీల్లో పలు హాలీవుడ్ సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. అయితే గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు అందుకున్న 'నాటు నాటు' పాట తాజాగా మరోసారి అస్కార్​ వేదికపై సందడి చేసింది.

ఈ అవార్డ్స్​ కార్యక్రమంలో భాగంగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో 'వాట్‌ వాజ్‌ ఐ మేడ్‌ ఫర్‌?' (What Was I Made For?)పాటకు అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రజెంటేషన్ సమయంలో స్టేజ్ బ్యాక్​గ్రౌండ్​లో 'నాటు నాటు' పాటతో పాటు విజువల్స్​ ప్లే చేశారు. ఈ వీడియోను ఆర్​ఆర్​ఆర్​ సినిమా అధికారిక ట్విట్టర్​ పేజ్​లో షేర్ చేసింది. దీంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ వేదికపై మరోసారి తెలుగు పాట మార్మోగిపోవడం పట్ల టాలీవుడ్ ఫ్యాన్స్​ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా కోసం రిస్క్ చేస్తూ స్టంట్స్​ చేసే మాస్టర్ల కోసం కూడా ఓ వీడియో ప్లే చేశారు. హాలీవుడ్​ సినిమాల్లోని కొన్ని స్టంట్ సీన్స్​ ప్లే చేశారు. అయితే అందులో కూడా ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీన్ ఉంది.

గతేడాది ఈ అత్యున్నత పురస్కారం ఆస్కార్ మన తెలుగు సినీ పాటను వరించింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్​బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్​లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. లిరిక్ రైటర్​ చంద్రబోస్ కలంలోని సాహిత్యం, పదునైన పదాలకు కీరవాణి చేతుల్లో నుంచి వచ్చిన సంగీతం ఈ పాటకు ప్రాణం పోసింది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ఈ పాటకు ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఏకంగా ఆస్కార్ సభ్యులనే నాటు నాటు అనేలా ఊపేసిన ఈ పాట 2023లో ఆస్కార్​ను కైవసం చేసుకుంది.

ఆస్కార్ @96 : గతేడాది 'నాటు నాటు'కు - మరి ఈ సారి కూడా భారత్​కు దక్కేనా?

'నాటు నాటు' బీటౌన్ వెర్షన్​ - ఆ సాంగ్​కు హుక్​ స్టెప్​ వేసిన అక్షయ్​, టైగర్​

Last Updated : Mar 11, 2024, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.