ETV Bharat / entertainment

'NTR 31' హీరోయిన్ ఫిక్స్- ప్రశాంత్ ఛాయిస్ అదుర్స్! - NTR 31 Heroine - NTR 31 HEROINE

NTR 31 Heroine: ఎన్టీఆర్ సినిమా గురించి కీలక అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా సినిమాలో కోసం స్టార్ హీరోయిన్​ను ఎంపిక చేశారంట. మరి ఆమె ఎవరంటే?

NTR 31 Heroine
NTR 31 Heroine (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 10:53 AM IST

NTR 31 Heroine: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్​పై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా అనౌన్స్​మెంట్ నుంచి కేవలం రెండు పోస్టర్లు మినహా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఇక రీసెంట్​గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా షూటింగ్​కు సంబంధించి మేకర్స్​ ఓ అప్డేట్ ఇచ్చారు. 2024 ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్​ హీరోయిన్ ఎంపికపై దృష్టి పెట్టారు.

మాస్ డైరెక్టర్- స్టార్ హీరోతో భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న సినిమాలో కచ్చితంగా అంతే క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎంచుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ నేషనల్ క్రష్ రష్మక మంధన్నాతో సంప్రదింపులు జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ కథకు రష్మిక సరిగ్గా సరిపోతుందని సినిమా యూనిట్ భావిస్తుందట. ఈ బ్యూటీకి ఇప్పటికే కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే రష్మిక- ఎన్టీఆర్‌ కాంబోలో రానున్న తొలి సినిమా ఇదే అవుతుంది.

ఆ సినిమాలే కారణమా? అయితే గత రెండేళ్లలో రష్మిక నటించిన పుష్ప పార్ట్-1, యానిమల్ సినిమాలు భారీ విజయాలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీంతో ఇండియావైడ్​గా మూవీ లవర్స్​కు రష్మిక పరిచయమైంది. మరోవైపు ఈమె నటనకు బ్యూటీ తోడవడంతో ఈ సినిమాలో ఆఫర్ కొట్టేసినందని అంటున్నారు. కానీ, దీనిపై మేకర్స్​ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది.

టైటిల్ ఫిక్స్! ఎన్టీఆర్- ప్రశాంత్ మూవీ ఫిక్సైనప్పటి నుంచి 'NTR31' వర్కింగ్ టైటిల్​తో సినిమా అప్డేట్స్ చెబుతున్నారు. అయితే రీసెంట్​గా తారక్ బర్త్​డే రోజు టైటిల్ కూడా అనౌన్స్​ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. అయితే సినిమాకు 'డ్రాగన్' అని పేరును పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'NTR 31' సాలిడ్ అప్డేట్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడంటే? - NTR 31 Movie

పవర్​ఫుల్​ టైటిల్​తో 'NTR 31' - బర్త్​డే రోజు రివీల్! - JR NTR PRASANTH NEEL MOVIE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.