ETV Bharat / entertainment

రష్మిక సాధించిన ఈ 6 రికార్డులు తెలుసా? - అన్నింటిలోనూ నెం.1 - Rashmika Birthday - RASHMIKA BIRTHDAY

National Crush Rashmika Happy Birthday : నేషనల్ క్రష్​ రష్మిక పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 5). ఈ సందర్భంగా ఆమె సాధించిన పలు రికార్డులను చూసేద్దాం.

రష్మిక సాధించిన ఈ 6 రికార్డులు తెలుసా? - అన్నింటిలోనూ నెం.1

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 11:45 AM IST

National Crush Rashmika Happy Birthday : కిరాక్ పార్టీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఛలో సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైంది. పుష్పతో నేషనల్ క్రష్​గా మారింది. యానిమాల్​తో బాలీవుడ్​లోనూ స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే ఈ భామ కేవలం నటిగానే కాదు ఇతర వాటిల్లోనూ ముందే ఉంటుంది. అలా తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకుంది. నేడు(ఏప్రిల్ 5) పుట్టినరోజు సందర్భంగా ఆమె సాధించిన రికార్డులు ఏంటో తెలుసుకుందాం..

  • రీసెంట్​గా టోక్యోలో జరిగిన క్రంచీ రోల్‌ అనిమే అవార్డులకు రష్మిక హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ ఆమెకు ఘన స్వాగతం దక్కింది. ఇండియా నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మికనే కావడం విశేషం.
  • ఈ ఏడాది ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ అనౌన్స్ చేసిన ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితాలోనూ రష్మిక చోటు దక్కించుకోవడం విశేషం. ప్రతి ఏడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్‌ను ఫోర్బ్స్‌ విడుదల చేస్తుంది. అందులో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.
  • హీరోయిన్​గా బిజీగా రాణిస్తున్న రష్మిక పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్​గానూ రాణిస్తోంది. అలానే జపాన్‌కు చెందిన ఒనిట్సుకా టైగర్‌ ఫ్యాషన్‌ సంస్థకు బ్రాండ్‌ అడ్వకేట్‌గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థకు బ్రాండ్‌ అడ్వకేట్‌గా నియమితులైన తొలి భారతీయురాలు కూడా రష్మికనే. ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పింది. ఇంకా గతేడాది నిర్వహించిన మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లోనూ సందడి చేసింది.
  • సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మికకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. 43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు నుంచి ఈ మార్క్‌ అందుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్‌ సంపాదించుకుంది.
  • ఇప్పటికే తన యాక్టింగ్​తో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రష్మిక రీసెంట్​గా నెదర్లాండ్స్‌కు చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్‌లో నిలిచింది. బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో భారత్​ నుంచి ఈ ఘనత అందుకున్న ఏకైక నటి రష్మికనే.
  • ఇంకా తన మొదటి చిత్రంతోనే తన నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును దక్కించుకుంది. ఇదే జాబితాలో ఇప్పటివరకు తొమ్మిది సార్లు అవార్డును ముద్దాడింది. త్వరలోనే పుష్ప 2తో సందడి చేయనుంది.

'ఫ్యామిలీ స్టార్' విజయ్​ - ప్రేక్షకులను మెప్పించారా ? - Family Star Twitter Review

'అతడి కోసమే ఆ పని చేశాను' - రష్మిక టాటూ వెనక సీక్రెట్ ఇదే! - Rashmika Mandanna Birthday

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.