National Awards 2024 Best Actor Rishab Shetty : తన సినీ కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటనతో అసలు సినిమాల వైపే వెళ్లకూడదని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి, ఇప్పుడు తాజాగా విడుదలైన 70వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నిలిచారు. ఆయనే కాంతార ఫేమ్ హీరో రిషబ్ శెట్టి. ఒకప్పుడు అప్పు ఇచ్చిన వాళ్లకు కనిపిస్తే ఎక్కడ గొడవ చేస్తారోనని మారువేషాల్లో తిరిగిన ఆయన ఇప్పుడు ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకోవడం విశేషం. ఎన్నో ఒడుదొడుకులతో సాగిన ఆయన సినీ జర్నీ, లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం.
గేమ్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా - రిషబ్ శెట్టిది కర్ణాటకలోని కెరాడి అనే పల్లెటూరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ రత్నావతి. నాన్న భాస్కరశెట్టి. తండ్రి జ్యోతిష్యం చెప్పేవారు. రిషబ్‌కు ఓ అక్క, అన్న ఉన్నారు. చదువులో కన్నా ఆటల్లోనే చురుగ్గా ఉండేవారు రిషబ్. అలా ఆయన జూడో కాంపిటీషన్స్ పలు మెడల్స్‌ను కూడా సాధించారు. అది రిషబ్ తండ్రికి అస్సలు నచ్చేది కాదట. దీంతో రిషబ్‌ను బెంగళూరుకు పంపించి చదివించారు.
అలా నటనపై పూర్తి ఫోకస్ - తన తండ్రి కోపంతోనే పంపించినా రిషబ్ మాత్రం ఎంతో ఆనందంలో మునిగి తేలారు. ఎందుకంటే రిషబ్‌కు చిన్నప్పటి నుంచి హీరో రాజ్‌కుమార్ పాటలను ఎక్కువగా వింటూ ఉంటేవారట. అలా ఆయనకు నటుడు కావాలనే ఆసక్తి పెరిగిందట. ఓ సారి తన ఊరిలోని కళాకారులతో కలిసి మీనాక్షి కల్యాణి అనే యక్షగాన ప్రదర్శనలో నటించారు. షణ్ముగ అనే పాత్ర పోషించారు. అందులో రిషబ్ నటనకు ప్రశంసలు దక్కాయి. దీంతో ఆయన నటనపై మరింత దృష్టి పెట్టారు.
అనంతరం ఉపేంద్ర తెరకెక్కిన ఓం, ష్‌లాంటి సినిమాలు చూసి దర్శకత్వంపై కూడా ఆసక్తి పెరిగింది. అయితే సినీ ఫీల్డ్‌కు సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలంటే బెంగళూరుకే రావాలి. అందుకే తన తండ్రి బెంగళూరుకు పంపిస్తే రిషబ్ ఎంతో సంతోషించారు.
అక్క సాయం - బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన రిషబ్ ఓ నాటక బృందంలో చేరి నాటకాలు వేసేవారు. డిగ్రీ పూర్తి చేయకుండానే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ట్రైనింగ్‌కు చేరారు. ఆ సమయంలో తన అక్క రిషబ్‌కు అండగా నిలిచారు.
తొలి అవకాశం అలా - రిషబ్ మినరల్ వాటర్ వ్యాపారం కూడా చేశారు. అలా రిషబ్ ఓ క్లబ్‌కు వాటర్ సప్లై చేసేవారు. ఆ సమయంలో కన్నడ నిర్మాత ఎం.డి.ప్రకాశ్ అక్కడికి వచ్చారు. అప్పుడు రిషబ్ తనకు ఏమైనా అవకాశం ఇప్పించాలని ఆయన్ను అడిగారు.
అలా రిషబ్‌కు సైనైడ్ చిత్రానికి సహాయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారాయన. అక్కడ రోజుకు యాభై రూపాయలు రిషబ్ జీతం. అయితే షూటింగ్‌కు వెళ్లేందుకే ఆయనకు దాదాపు రూ.100 వరకు ఖర్చు అయ్యేది. ఆ షూటింగ్ సెట్లో రిషబ్ లైట్‌బాయ్, ఎడిటర్, టచప్ మ్యాన్ అన్ని పనులు నేర్చుకునేవారు. కానీ, ఆ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో మళ్లీ వాటర్ సప్లై వ్యాపారం చేసేవారు.
సినిమాలే వద్దనుకున్నారు - అనంతరం ప్రముఖ డైరెక్టర్ రవి శ్రీవత్స తెరకెక్కించిన గండ హెండతి మూవీ యానిట్లో క్లాప్ బాయ్‌గా జాయిన్ అయ్యారు. అయితే ఆ డైరెక్టర్‌కు బాగా కోపమట. ఓ రోజు కెమెరామెన్ చెప్పడంతో ఓచోట నిలబడ్డారు రిషబ్. కానీ అదే సమయంలో దర్శకుడు వచ్చి ఇక్కడెవరు నిన్ను నిల్చోమన్నారు అంటూ మండి పడ్డారు. అప్పుడు కెమెరా మెన్ చెప్పింది వినాలా లేదా డైరెక్టర్ చెప్పింది వినాలా అంటూ రిషబ్‌కు అస్సలు అర్థం కాలేదు. దీంతో ఆయన ఎవరికి చెప్పకుండా ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ డైరెక్టర్ దెబ్బకు సినిమాలవైపే మళ్లీ వెళ్లకూడదని అనుకున్నారట. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ నిర్ణయం మార్చుకుని సినిమా రంగంపైనే అడుగులు వేసి దర్శకుడిగా, నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలోనే కాంతార సినిమా జాతియ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో కాంతార 2 సినిమా చేస్తున్నారు.
లైవ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ - బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి - 70th National Film Awards