Nara Rohith Pratinidhi 2 Release Trailer : నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. అసలే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఎన్నికల వేడిలో మండిపోతున్నాయి. ఇప్పుడు విడుదలైన ప్రతినిధి 2 ట్రైలర్ ఆ వేడిని ఇంకాస్త పెంచేలా ఉంది. ట్రైలర్లోనే కాస్త కాంట్రవర్సీని టచ్ చేసినట్లు కనిపిస్తోంది.
సీఎంను ఎందుకు చంపావు అంటూ మొదలైన ట్రైలర్లో నారా రోహిత్‌ను మొదట ఒక జర్నలిస్టుగా చూపించారు. ఆ తర్వాత సరికొత్త గెటప్పులో వృద్దుడిగా నారా రోహిత్ కనిపిస్తూ యాక్షన్ చేశారు. ఆపైన 15 ఏళ్ల క్రితం సమైఖ్య ఆంద్రప్రదేశ్‌లో జరిగిన యధార్ధ ఘటనలను గుర్తు చేసే సీన్స్ కొన్ని ట్రైలర్లో కనిపిస్తాయి. ట్రైలర్లో ఒక ముఖ్యమైన పాత్రలో హుషారు ఫేమ్ దినేశ్ తేజ కనిపించారు. తండ్రి చనిపోయినప్పుడు తన బాబాయి - “అన్నయ్య ఆశయాలను మాత్రం నువ్వే ముందుకు తీసుకు వెళ్ళలిరా” అని చెప్పగా “ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నాన్నగారు చనిపోయి పదిహేడు రోజులు కూడా కాలేదు. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేశారా?” అని దినేశ్ చెప్పడం, ఆ తర్వాత “పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్. మనల్ని ఎవడేం చేస్తాడు” అని చెప్పడం వంటివి చూపించారు. ఇక జిషూసేన్ గుప్తా ఒక కీలక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. కామెడీ విలన్ పాత్రల్లో మెప్పించే అజయ్ ఘోష్ కూడా ఇందులో ఒక రాజకీయ నాయకుడి పాత్ర పోషించారు. సచిన్ ఖేడేకర్ ఈ మూవీలో సీఎం పాత్ర పోషించారు. ఇక టీజర్, పోస్టర్లలో కనిపిస్తున్న ఒకప్పటి యాంకర్ ఉదయభాను ఈ తాజా ట్రైలర్లో మాత్రం కనిపించలేదు.
కాగా, పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి మూవీ సామాజిక సమస్యలపై పోరాడితే ప్రతినిధి2 రాజకీయ సమస్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని తెలిసేలా తెరకెక్కించారు. ఈ మూవీలో నారా రోహిత్‌తో పాటు రఘుబాబు, ఇంద్రజ, తనికెళ్ళ భరణి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటింటారు. కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని కలిసి ఈ చిత్రాన్ని రానా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు మూర్తి దేవగుప్తపు తీసుకోగా సంగీతం మహతి స్వర సాగర్ అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దిల్ రాజుతో పెద్ద గొడవ - కాళ్లు పట్టేసుకున్న సుకుమార్! - Dil Raju Sukumar