ETV Bharat / entertainment

ఆ ఓటీటీలోనే 'సరిపోదా శనివారం' - ఎప్పుడు వస్తుందంటే? - Saripoda Sanivaram OTT

Nani Saripoda Sanivaram OTT Details : నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' పాజిటివ్ రెస్పాన్స్​ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మూవీ ఓటీటీ డీటెయిల్స్​ కూడా తెలిశాయి. ఇంతకీ ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం.

source ETV Bharat
Nani Saripoda Sanivaram OTT Details (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 7:42 AM IST

Nani Saripoda Sanivaram OTT Details : టాలీవుడ్​లో నేచరల్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నాని. తన సహజమైన యాక్టింగ్​తో పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని ఎంతో మంది యూత్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్​ను సంపాదించుకున్నారు. ఈ మధ్య బ్యాక్​ టు బ్యాక్​ వరుస హిట్లను అందుకున్న ఆయన తాజాగా 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

'దసరా', 'హాయ్ నాన్న' వంటి సక్సెస్​లు తర్వాత అదే జోష్​లో ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' సినిమా చేశారు. 'అంటే సుందరానికీ' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. దానికి తోడు విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్​ బాగానే పెంచాయి. ఇప్పుడా ఆ హైప్​కు తగ్గట్టే సినిమా మొదటి షో నుంచే మంచి రెస్పాన్స్​ను(Nani Saripoda Sanivaram Review) అందుకుంటోంది. సినిమా గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాని మళ్లీ హిట్ కొట్టాడంటూ రివ్యూలు వస్తున్నాయి. కథతో పాటు నాని, ఎస్​ జే సూర్య నటన, బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఇదే సమయంలో 'సరిపోదా శనివారం' డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఆ మధ్య అధికారికంగా కూడా ప్రకటించారు. ఇప్పుడీ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో అఫీషియల్​గా కూడా రివీల్ చేశారు. భారీ మొత్తానికే నెట్​ఫ్లిక్స్​ ఈ చిత్రాన్ని దక్కించుకుందట. ఈ 'సరిపోదా శనివారం' థియేటర్లలోకి వచ్చిన(ఆగస్ట్​ 29) నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు అగ్రీమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు సినిమాలో ఇతర పాత్రల్లో కనిపించారు.

నాని 'సరిపోదా శనివారం' ఎలా ఉందంటే? - Saripoda Sanivaram Movie Review

యూఎస్ బాక్సాఫీస్​ వద్ద 'సరిపోదా శనివారం' జోరు​ - ఇప్పటివరకూ ఎంత వసూలు చేసిందంటే? - Saripodhaa Sanivaaram US Premiers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.