ETV Bharat / entertainment

'సరిపోదా శనివారం' స్టోరీ రివీల్- నాని పాత్ర ఎలా ఉండనుందంటే? - Nani Saripodhaa Sanivaaram - NANI SARIPODHAA SANIVAARAM

Nani Saripodhaa Sanivaaram: స్టార్ హీరో నాని ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా 'సరిపోదా శనివారం' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంట్వర్వ్యూలో నాని మాట్లాడుతూ సినిమాలోని హీరో పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nani Saripodhaa Sanivaaram
Nani Saripodhaa Sanivaaram (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 7:50 PM IST

Nani Saripodhaa Sanivaaram: నేచురల్‌ స్టార్‌ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో రానున్న యాక్షన్ డ్రామా మూవీ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్​గా ప్రియాంక మోహన్ నటించింది. ప్రధాన పాత్రలో ఎస్ జె సూర్య నటించారు. వికేక్‌ ఆత్రేయ- నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఆగస్టు 29న ఈ మూవీని తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్​గా రిలీజ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం తమిళ్​ ప్రమోషన్స్‌లో సినిమా బృందం బిజీగా ఉంది. ఈ సందర్భంలో నాని హీరో పాత్ర ఎలా ఉండబోతోందోనని వివరించారు. 'కోపం తరచుగా పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. కొన్నిసార్లు, ప్రజలు చిన్న చిన్న విషయాలు, పనికి రాని అంశాలపై కూడా కోపం తెచ్చుకుంటారు. కొంచెం ఓపికగా ఉండటం ద్వారా మన కోపం సరైనదేనా? కాదా? అనేది అంచనా వేయవచ్చు. తన కోపాన్ని అంచనా వేయడానికి శనివారం వరకు వేచి ఉండే సూర్య పాత్రను నేను పోషిస్తున్నాను. అతడు కారణం లేని కోపాన్ని, అనర్థాలను నివారించడానికి శనివారం వరకు వేచి ఉంటాడు' అని తెలిపారు.

సూర్య పాత్ర గురించి కూడా నాని మాట్లాడారు. 'సూర్య తనను ఇరిటేట్ చేసిన వారి పేర్లను వారం మొత్తం నోట్‌ చేస్తాడు. ముఖ్యమైనవి కాదని భావించే పేర్లను లిస్టులో నుంచి తీసేస్తాడు. ఒక వేళ ఎవరి మీదనైనా కోపం వారమంతా ఉంటే అప్పుడు అర్థవంతమైన కోపంగా భావిస్తాడు. ఆ కోపానికి కారణమైన వ్యక్తిని కొట్టడానికి సిద్ధపడిపోతాడు. సాధారణంగా కోపం మంచిది కాదని ప్రజలు చెబుతారు. కానీ సరైన ప్రయోజనం కోసం వచ్చే కోపం శక్తిమంతమైన ఆయుధం వంటిది' అని వివరించాడు.

'బలగం' వేణుతో నాని!
గతేడాది విడుదలైన 'హాయ్‌ నాన్న' సినిమాతో నాని మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాని తన నెక్ట్స్‌ సినిమాకి వేణుతో కలిపి పని చేయనున్నట్లు సమాచారం. 'బలగం' మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు, నానితో పీరియాడికల్ ప్రేమకథ ప్లాన్ చేసినట్లు తెలిసింది.

నాని మాస్ వార్నింగ్ - 'సరిపోదా శనివారం' ట్రైలర్ చూశారా? - Nani Saripodhaa Sanivaaram Trailer

న‌ర‌కాసురిడిని వధించేందుకు నాని రెడీ - పవర్​ఫుల్​గా 'సరిపోదా శనివారం' టీజర్ - Saripodhaa Sanivaaram Teaser

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.