ETV Bharat / entertainment

అసిస్టెంట్ డైరెక్టర్​ టు రూ.100 కోట్ల స్టార్ - అందరు హీరోల్లా నాని చేయకపోవడానికి కారణం ఇదే! - Nani Career Journey

Nani Birthday: టాలీవుడ్ స్టార్ నాని శనివారం (ఫిబ్రవరి 24) 40వ బర్త్​డే జరుపుకుంటున్నారు. అయితే ఓ అసిస్టెంట్ డైరెక్టర్​గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నాని కథ మీకు తెలుసా?

Nani Birthday
Nani Birthday
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 6:57 AM IST

Nani Birthday : రేడియో జాకీగా తన కెరీర్​ను మొదలుబెట్టి, ఓ అసిస్టెంట్​ డైరెక్టర్​గా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నేచురల్ స్టార్ నాని. తొలి సిినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన నాని, ఆ తర్వత తనన తాను డిఫరెంట్ రోల్స్​కు తగ్గట్లుగా మలుచుకుని ప్రేక్షకులను అలరించారు. ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా టాలీవుడ్​లోకి అడుగుపెట్టిన ఈ పక్కింటి కుర్రాడు, ఇండస్ట్రీలో అంచలెంచలుగా ఎదిగి తనకు తానే ఒక బ్రాండ్​గా నిలిచారు. ఎంతోమందికి ఇన్​స్పిరేషన్​గా నిలిచారు. 'అర్హత ఉన్నవాడికే అదృష్టం లభిస్తుంది' అంటూ ఒకానొక సందర్భంలో నాని చెప్పుకొచ్చారు. నాని విషయంలో అది అక్షర సత్యం అనే చెప్పాలి.

బాపు, కే.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్​గా పని చేసిన నాని, తన పనితీరుతో ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయన తెరకెక్కించిన 'అష్టచమ్మ' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తన క్యూట్ లుక్స్​తో ఎంతో మంది అమ్మాయిల మనసులు కొల్లగొట్టారు. తొలి సినిమాతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నాని ఆ తర్వాత టాలీవుడ్​లో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు.

2011లో డైరెక్టర్ నందిని రెడ్డి రూపొందించిన 'అలా మొదలైంది' సినిమా నాని కెరీర్​ను ఓ మలుపు తిప్పింది. ఆయన నేచురల్ యాక్టింగ్​కు మంచి మార్కులు పడ్డాయి. అయితే .2012లో విడుదలైన ఈగ సినిమాతో నాని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత చేసిన 'సెగ', 'పిల్ల జమిందార్​' సినిమాల్లోనూ ఆయన నటనకు ప్రశంసలు పొందారు. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సినిమాతో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందారు. ఇందులో ఆయన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, తన యాక్టింగ్​తో సౌత్​తో పాటు నార్త్​లోనూ పేరు సంపాదించారు.

ఇండస్ట్రీలో జయాపజయాలు అనేవి సహజం అన్నట్లు నాని కూడా తన కెరీర్​లో కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఆయన నటించిన 'పైసా', 'జెండాపై కపిరాజు', 'ఆహా కల్యాణం' లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయారు. అలా కెరీర్​ కాస్త డీలా పడిందన్న సమయంలో 'భలే భలే మగాడివోయ్' సినిమాతో సూపర్​ కమ్​బ్యూక్​ ఇచ్చారు నాని. తన నటన, కామెడీ టైమింగ్​తో ప్రేక్షకులను అలరించారు నాని. ఆ తర్వాత వచ్చిన 'జెంటిల్​మెన్​', 'మిడిల్​ క్లాస్​ అబ్బాయి','నేను లోకల్​' లాంటి సినిమాలతో తిరిగి ఫామ్​లోకి వచ్చారు నాని.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2019లో విడుదలైన 'జెర్సీ' సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపించారు నాని. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అయితే అప్పటి వరకు రీజనల్​ జానర్​కే పరిమతమైన నాని, 'దసరా' సినిమాతో పాన్ ఇండియా లెవెల్​లో బ్లాక్​బస్టర్ హిట్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వందకోట్ల హీరోగా రికార్డుకెక్కారు. ఇటీవలే వచ్చిన 'హాయ్​ నాన్న' కూడా సూపర్​ హిట్​ టాక్ అందుకుని బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్లింది.

ఇలా వరుస హిట్లతో స్టార్​డమ్​ సంపాదించుకున్న నాని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తాను హిందీ పరిశ్రమలో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే తనకు వచ్చిన హిందీతో బాలీవుడ్‌లో రాణించడం కష్టమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా మంచి కథతో పాటు డైరెక్టర్‌ దొరికితే తప్పకుండా బాలీవుడ్‌లో సినిమా చేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతే ఇక ఒక జానర్ సినిమాలకు మాత్రమే ఫిక్స్ అవ్వకుండా, అన్ని జానర్ లలో సినిమాలు చేయడమే తన లక్ష్యమంటూ నాని అన్నారు.

"ఏ జానర్‌నీ రిపీట్ చేయకపోవడాన్ని నేను కంఫర్ట్‌గా ఫీలవుతాను. అంటే ఓ నేపథ్యమున్న కథలో నటిస్తే మళ్లీ అలాంటి దాంట్లో నటించకూడదని అనుకుంటుంటాను. ఓ నటుడిగా నేనెప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటాను. ఫలానా జానర్‌ చిత్రం వర్కౌట్‌ అవుతుందనుకుని, అలాంటి వాటిల్లోనే నటిస్తూ డబ్బు సంపాదిస్తే బిజినెస్‌మ్యాన్‌ అవుతానుగానీ నటుణ్ని కాలేను కదా. ఒక్కో చిత్రానికి ఒక్కో టార్గెట్ ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రతి సినిమాని ప్రత్యేకంగా చూడాలి." అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రస్తుతం నాని డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్​తో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. దీంతో ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్​తో పాటు మూవీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

దిల్​రాజు చేతికి నాని 'సరిపోదా శనివారం' - ఎన్ని కోట్లంటే?

ఏడాదిలో నానికి రెండో హిట్- ఈ హీరో సక్సెస్ ఫార్ములా ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.