ETV Bharat / entertainment

రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున? - రాజమౌళి మహేశ్ సినిమాలో నాగార్జున

Nagarjuna in Rajamouli Mahesh Babu Movie : రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున కూడా భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలిసింది. ఆ వివరాలు.

రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున?
రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున?
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 8:39 PM IST

Updated : Jan 30, 2024, 10:32 PM IST

Nagarjuna in Rajamouli Mahesh Babu Movie : సూపర్ స్టార్​​ మహేశ్​ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్​ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ ​డ్రాప్​తో సాగే యాక్షన్‌ అడ్వెంచరెస్‌ మూవీగా తీర్చిదిద్దబోతున్నారు. సినిమాలో మహేశ్​ బాబు సాహసికుడి పాత్రలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. జక్కన్న ఈ సినిమాను చాలా పెద్ద స్కేల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌(Rajamouli mahesh babu movie budget) అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేఎల్ నారాయణ నిర్మాత. అయితే ఈ సినిమా కోసం మహేశ్​ బాబు పారితోషికం తీసుకోవడం లేదట. ఎందుకంటే ఆయన ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నట్టు సమాచారం.

Rajamouli Mahesh Babu Movie Producer : అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటికే అనేక వార్తలు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చిత్రంలో కింగ్‌ నాగార్జున కూడా భాగం కాబోతున్నారని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన కూడా నిర్మాణంలో భాగం అవ్వబోతున్నారని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్షన్‌ బ్యాక్‌ సపోర్ట్​గా ఉంటుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా, ఆ మధ్య రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఇండియన్‌ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతునట్లు తెలిపారు. ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారట. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఓ క్యాస్టింగ్‌ ఏజెన్సీతోనూ జక్కన్న చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మరి ఈ చిత్రం ఒక భాగంగా వస్తుందా? లేక రెండు భాగాలుగా వస్తుందా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.

గేమ్ ఛేంజర్, ఓజీ : బాబాయ్​ - అబ్బాయ్​ బాక్సాఫీస్ క్లాష్!

'జై హనుమాన్​'లో చిరు - మహేశ్​ : అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ!

Last Updated : Jan 30, 2024, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.