Naga Chaitanya Janaka Aithe Ganaka : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సందీప్ బండ్ల తెరకెక్కించిన 'జనక అయితే గనక' దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమాతోనే సందీప్ డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. యంగ్ నటుడు సుహాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే రిలీజ్ దగ్గర పడుతుండడం వల్ల మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న దర్శకుడు సందీప్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. మొదట ఈ సినిమాకు అక్కినేని నాగ చైతన్యను హీరోగా అనుకున్నట్లు ఆయన చెప్పారు.
'నాగ చైతన్యతో కలిసి కొన్ని నెలలు ట్రావెల్ చేశాను. నా తొలి సినిమాలో ఆయననే హీరోగా అనుకున్నాను. కానీ, ఆ సమయంలో శేఖర్ కమ్ములతో చైతన్య 'లవ్‌స్టోరీ' సినిమాతో బిజీగా ఉన్నారు. అందుకే నాతో సినిమా చేయలేకపోయారు. అప్పుడే నిర్మాత దిల్‌రాజు, లీడ్ రోల్ కోసం సుహాస్ పేరును చెప్పారు' అని దర్శకుడు సందీప్ తెలిపారు. అయితే మిడిల్ క్లాస్ వ్యక్తి తండ్రి అవ్వడానికి ఎలా ఆలోచిస్తాడు? ఖర్చులకు విపరీతంగా ఆలోచించే అలాంటి వ్యక్తి తండ్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? అచ్చం అలాగే తాను అనుకున్న విధంగా బెస్ట్ ఇవ్వలేనేమోననే భయంతో పిల్లలు వద్దనుకునే మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్ర పోషించారు సుహాస్.
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాగా, రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ బుధవారం రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సంగీర్తన విపిన్ కీలక పాత్ర పోషించింది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. 'బేబి' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
'జనక అయితే గనక' రిలీజ్ డేట్ ఔట్- ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా! - Suhas Janaka Aithe Ganaka
సుహాస్ కోసం రంగంలోకి సుకుమార్ - మ్యాటర్ ఏంటంటే? - Suhas Prasanna vadanam