Mouni Roy Latest Interview : తన అందం, అభినయంతో అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెరపై సెస్సేషన్స్ క్రియేట్ చేసింది బీ టౌన్ బ్యూటీ మౌనీ రాయ్. 'నాగిని’' సీరియల్‌తో అన్ని భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకుంది ఈ బ్యూటీ. 'గోల్డ్' అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ స్టార్ హీరోయిన్, ఆ తర్వాత బ్రహ్మాస్త్రలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవలే ఆమె ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. కెరీర్లో తాను ఎదుర్కొన్న సంఘటనలు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యింది.
"నేను అందంగా, అట్రాక్టివ్‌గా ఉండనని నన్ను నేను విమర్శించుకుంటూ అదే నిజం అనే నిర్ణయానికి వచ్చాను. ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఇటువంటి ఆలోచనల నుంచి బయటపడ్డాను. నన్ను నేను ప్రేమించడం, నన్ను నేను అంగీకరించడంలో నాకు ధ్యానం ఎంతో సహాయపడింది. ఈ విషయం నా స్నేహితుల అందరికీ తెలుసు. అయితే దీన్ని మీడియాకి చెప్పడం ఇదే తొలిసారి. నా 17 ఏళ్ల కెరీర్లో ఎన్నో సవాళ్లును ఎదుర్కొన్నాను. ఇంత గొప్ప స్థాయిలో నిలిచేందుకు కారణమైన టీవీ ఇండస్ట్రీని నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. సినిమాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తానని నేను భావించాను. అందుకే 'గోల్డ్' సినిమాకు సైన్ చేశాను. అందులో నా రోల్ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అందుకు నేను దీనికి సరిగ్గా సరిపోతానని అనిపించిం ఆ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను. ఆ తర్వాత బాగానే చేస్తున్నానని అనిపించి ఇంకొన్ని సినిమాల ఆడిషన్స్‌కు వెళ్లాను. అయితే అక్కడ లుక్ టెస్ట్ చేసి షార్ట్‌లిస్ట్ చేసిన వాళ్లలో నేను రెండో స్థానంలో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు అంతగా అవకాశాలు వచ్చేవి కావు. వాటికి సరైన కారణాలు కూడా ఉండేవి కావు. ఇండస్ట్రీ ఇలానే ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది. ఏది జరిగినా, చేదు అనుభవాలు ఎదురైనా కూడా మనం ముందుకే సాగాలి. ఇప్పుడు నేను చేయాలనుకున్నది చేయగలుగుతున్నానంటే అది నా అదృష్టం. నేను పడిన కష్టం, విధి విజయాన్ని అందించాయి" అని మౌనీ తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ - వన్‌పీస్ డ్రెస్‌లో మౌనీ హొయలు
Mouni Roy Latest Photos : బ్లాక్ డ్రెస్‌లో మౌనీ స్టన్నింగ్ లుక్స్.. అందాల్లో ఈ అందం వేరయా!