ETV Bharat / entertainment

రెహమాన్‌ విడాకులతో లింక్‌ రూమర్స్​ - క్లారిటీ ఇచ్చిన మోహినిదే - AR RAHMAN MOHINI DEY DIVORCE

ఏఆర్‌ రెహమాన్‌ దంపతుల విడాకులతో తన డివోర్స్‌ను లింక్ చేస్తూ వస్తోన్న వార్తలపై స్పందించిన రెహమాన్‌ టీమ్ మెంబర్ మోహినిదే.

AR Rahman Mohini Dey Divorce
AR Rahman Mohini Dey Divorce (source ANI And ETV Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 12:02 PM IST

AR Rahman Mohini Dey Divorce : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్‌ - సైరా బాను దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట డివోర్స్​ ప్రకటించిన కాసేపటిలోనే రెహమాన్‌ టీమ్​లోని 29 ఏళ్ల మోహినిదే అనే సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపింది. అలా ఈ ఇద్దరూ ఒకే సారి నిర్ణయం ప్రకటించడంపై రకరకాల వార్తలు రావడం ప్రారంభం అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ చర్చించుకోవడం ప్రారంభించారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది దీని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై మోహినిదే స్పందించారు. ఆ రూమర్స్‌ను ఆమె ఖండించారు. తన గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.

"నేను డివోర్స్​ గురించి అనౌన్స్​ చేసినప్పటి నుంచి ఇంటర్వ్యూల కోసం చాలా మంది ఫోన్‌ చేస్తున్నారు. కానీ వారంతా నా ఇంటర్వ్యూలను ఎందుకు అడుగుతున్నారో తెలుసు. నేను ప్రతిఒక్కరి రిక్వెస్ట్​ను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు ఏం అనుకుంటున్నారో, దాని గురించి మాట్లాడడానికి అస్సలు ఆసక్తి లేదు. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోలేను. ప్లీజ్​ నా గోప్యతను గౌరవించండి" అని మోహినిదే చెప్పుకొచ్చారు.

AR Rahman Saira Banu Divorce - ఇదే విషయంపై రెహమాన్ భార్య సైరా తరఫు న్యాయవాది వందనా షా కూడా ఇంతకముందే స్పందించారు. బయట చక్కర్లు కొట్టే రూమర్స్​లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. "ఈ రెండు జంటల డివోర్స్​కు ఎలాంటి సంబంధం లేదు. పరస్పర అంగీకారంతోనే సైరా- రెహమాన్‌ ఈ నిర్ణయాం తీసుకున్నారు. వైవాహిక బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. వారిద్దరూ విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి" అని పేర్కొన్నారు. ఇక రెహమాన్ పిల్లలు కూడా ఈ విషయంపై స్పందించారు. అందులో నిజం లేదని స్పష్టత ఇచ్చారు.

ఆమెతో రెహమాన్ విడాకులకు లింక్!​ - అసలు ఎవరీ మోహినీ దే?

బర్త్​డే ట్రీట్​ - మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్​లో నాగ చైతన్య - పోస్టర్ అదిరింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.