ETV Bharat / entertainment

హేమ కమిటీ రిపోర్ట్ ఎఫెక్ట్‌ - మోహన్​లాల్ సహా 17 మంది 'అమ్మ'కు రాజీనామా - Mohanlal AMMA Resignation - MOHANLAL AMMA RESIGNATION

Mohanlal AMMA Resignation :మాలీవుడ్​లో మహిళలపై లైంగిక వేధింపుల వివాదం నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్‌(AMMA) అధ్యక్ష పదవికి మలయాళ యాక్టర్ మోహన్‌లాల్​ తాజాగా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది కమిటీ సభ్యులు రాజీనామా చేశారు.

Mohanlal Resigns
Mohanlal (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 3:36 PM IST

Updated : Aug 27, 2024, 3:45 PM IST

Mohanlal AMMA Resignation : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(AMMA) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని 'అమ్మ' సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది.

అయితే కమిటీలోని కొంతమంది సభ్యులపైననే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, అందులో భాగంగానే నైతిక బాధ్యతగా వీళ్లందరూ ఇప్పుడు రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ మూకుమ్మడి రాజీనామాల వల్ల మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పాలక మండలిని రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.

అమ్మ సభ్యులు వీరే
ఇప్పటివరకు 'అమ్మ' సంఘానికి మోహన్‌లాల్ అధ్యక్షత వహించగా, నటులు జయన్‌ చేర్తలా, జగదీశ్‌, బాబురాజ్‌, సూరజ్‌ వెంజారమూడు, టొవినో థామస్‌, కళాభవన్‌ షాజన్‌ తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక తర్వాత డైరెక్టర్ రంజిత్‌, నటులు సిద్ధిఖీ, జయసూర్య, బాబురాజ్‌, ముకేశ్‌, సూరజ్‌ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమ్మ జనరల్‌ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి ఇటీవలే రాజీనామా చేశారు.

ఏంటీ ఈ హేమా కమిటీ రిపోర్ట్?
మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ కొన్నేళ్లపాటు శ్రమించి ఓ స్ట్రాంగ్ నివేదికను రూపొందించింది. తాజాగా అది వెలువడగా, అందులో పలు షాకింగ్‌ విషయాలు బయటకి వచ్చాయి. ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను రీసెర్చ్​ చేసిన హేమా కమిటీ, కాస్టింగ్‌ కౌచ్​ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పడుతున్న అనేక ఇబ్బందుల గురించి అందులో పేర్కొంది. ఇప్పుడీ కమిటీ రూపొందించిన నివేదికే మాలీవుడ్​లో తీవ్ర దుమారం రేపుతోంది.

మీడియాపై సురేశ్ గోపీ ఫైర్ - 'మీ స్వార్ధం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు' - Suresh Gopi Media

వేధింపుల ఆరోపణలపై కేరళ సర్కార్​ ఉన్నతస్థాయి కమిటీ- ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో! - Kerala Hema Panel Report

Last Updated : Aug 27, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.