ETV Bharat / entertainment

బాలనటుడిగా రాజమౌళి నటించిన సినిమా ఏంటో తెలుసా? - జక్కన్న డాక్యుమెంటరీ రివ్యూ - SS Rajamouli Documentary Review - SS RAJAMOULI DOCUMENTARY REVIEW

Modern Masters SS Rajamouli Documentary Review : దర్శకధీరుడు రాజమౌళి బాల నటుడిగా నటించిన సినిమా ఏంటో తెలుసా? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను జక్కన్నపై తెరకెక్కిన డాక్యుమెంటరీలో చూపించారు. ప్రస్తుతం ఇది నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​కు వచ్చింది. ఇంతకీ ఈ డాక్యుమెంటరీ ఎలా ఉందంటే?

source Getty Images
Modern Masters SS Rajamouli Documentary Review (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 5:59 PM IST

Modern Masters SS Rajamouli Documentary Review : తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. మోడ్రన్‌ మాస్టర్స్‌ : రాజమౌళి పేరుతో దీనిని రాఘవ్‌ కన్నా తెరకెక్కించారు. తాజాగా ఇది స్ట్రీమింగ్​కు అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏం చూపించారు? ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇంటర్వ్యూ ఫార్మాట్‌లో రాజమౌళి పర్సనల్​ లైఫ్​, ఆయన సినిమాల తెర వెనుక జరిగే సంగతులను ఇందులో చూపించారు. ఓ వైపు రాజమౌళిని ప్రముఖ జర్నలిస్టు, ఫిల్మ్‌ క్రిటిక్‌ అనుపమ చోప్రా ఇంటర్వ్యూ చేస్తుంటారు. మరోవైపు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్​తో పాటు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానా సహా పలువురు జక్కన్నతో కలిసి పని చేసిన అనుభవాన్ని చెబుతున్న దృశ్యాలను చూపించారు. మగధీర గురించి రామ్‌ చరణ్‌ చెప్పగా, స్టూడెంట్‌ నెం. 1 గురించి ఎన్టీఆర్‌ కొత్త సంగతులు చెప్పుకొచ్చారు.

ఆ విషయాలపై స్పందన - ఇంకా తన ఫ్యామిలీ బ్యాక్​గ్రౌండ్, డైరెక్టర్​గా జర్నీ ఎలా ప్రారంభమైంది? తన సినిమాలకు ఏ ఫిల్మ్‌ బై ఎస్‌. ఎస్‌. రాజమౌళి అనే ట్యాగ్‌లైన్‌ ఎందుకు పెట్టారు? అసలు ఈ కథాలోచనలు ఎలా మదిలో వస్తాయి? ఏ సినిమాను ఎలా తెరకెక్కించారు? వంటి విషయాలను రాజమౌళి చెప్పారు. అలానే బాహుబలి సినిమా, అందులోని పాత్రల గురించి మాట్లాడారు జక్కన్న. ఈ సినిమా రిలీజ్​ రోజు ఫ్లాప్‌ టాక్‌ రావడం, కట్టప్ప క్యారెక్టర్‌ను తక్కువగా చూపించడం వంటి విషయాలపై స్పందించారు.

దర్శకుల ప్రశంసలు - ఇకపోతే రాజమౌళి టాలెంట్​ గురించి దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడారు. శాంతినివాసం సీరియల్ కోసం జక్కన్న చేసిన కృషి ఎలాంటిదో వివరించారు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ కూడా రాజమౌళికి ఉన్న నిబద్ధతను మెచ్చుకున్నారు.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్​ - ఇకపోతే పిల్లన గ్రోవి అనే సినిమాలో రాజమౌళి బాల నటుడిగా యాక్ట్ చేశారన్న విషయం, అర్థాంగికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పని చేశారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ను ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఇంకా ఇప్పటివరకు ఎవరూ చూడని రాజమౌళి పాత ఫొటోలను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు.

ఎలా ఉందంటే? - డాక్యుమెంటరీ బాగానే ఉన్నప్పటికీ డబ్బింగ్‌ అంతగా బాలేదు. తెలుగు యాక్టర్స్​వి ఒరిజినల్‌ వాయిస్‌నే పెట్టి ఉంటే బాగుండేది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ హిందీ, తమిళం, ఇంగ్లిష్‌లోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

బతికుండగానే టెడ్డీలోకి హీరోయిన్​ ఆత్మ - అల్లు శిరీష్​ 'బడ్డీ' ఎలా ఉందంటే? - Allu Sirish Buddy Movie Review

రూ.2 వేల కోట్ల ఆస్తి - ఆ ఇంటి వార‌సురాలితో రాజ్​ తరుణ్​ పెళ్లి​​! - Tiragabadara Saami Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.