ETV Bharat / entertainment

షూటింగ్​లో 'గోపాల గోపాల' నటుడికి అస్వస్థత- ఆస్పత్రికి తరలింపు

Mithun Chakraborty Health Condition: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు.

Mithun Chakraborty Health Condition
Mithun Chakraborty Health Condition
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 11:45 AM IST

Updated : Feb 10, 2024, 2:21 PM IST

Mithun Chakraborty Health Condition: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (73) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కోల్​కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బంగాల్​ కోల్​కతాలో శనివారం సినిమా షూటింగ్​ జరుగుతుండగా ఆయన కిందపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మిథున్ చక్రవర్తి శుక్రవారం రాత్రి నుంచే కాస్త అనారోగ్యంగా ఉన్నారట. శనివారం ఉదయం షూటింగ్​లో పాల్గొన్నాక ఛాతిలో నొప్పితో కూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ (Intensive Care Unit)లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

నేషనల్ అవార్డు విజేత: మిథున్ చక్రవర్తి బంగాల్​లో జన్మించినప్పటికీ బాలీవుడ్​లోనే స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. 'డిస్కో డ్యాన్సర్‌'తో కెరీర్​ ప్రారంభించిన ఆయన క్రమంగా బాలీవుడ్​లో స్టార్ హీరోగా ఎదిగారు. 80ల్లో అమితాబ్ బచ్చన్, రాకేశ్ ఖన్నాలాంటి స్టార్లు ఉన్న సమయంలో కూడా మిథున్ నటుడిగా మంచి​ గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్‌, కన్నడ, పంజాబీలో వందకు పైగా సినిమాల్లో నటించారు.

1976లో 'తాహేదార్ కథ' చిత్రానికి, 1992వ సంవత్సరంలో 'స్వామి వివేకానంద' సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు పొందారు. ఇక ఐఫా, ఫిల్మ్ ఫేర్​వంటి తదితర పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. రీసెంట్​గా మిథున్ చక్రవర్తిని కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక విక్టరీ వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కల్యాన్ మల్టీస్టారర్ సినిమా 'గోపాల గోపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ తర్వాత ఆది పినిశెట్టి 'మలుపు' సినిమాలోనూ నటించారు. 2022లో సూపర్ హిట్ చిత్రం 'కశ్మీర్ ఫైల్స్'​ సినిమాలో మిథున్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.

రాజకీయంలోకి ఎంట్రీ: సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) పార్టీతో రాజకీయ ప్రవేశం చేశారు. 2014లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన రెండేళ్లకే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు.

ప్రముఖ దర్శకుడు, 'గ్యాంగ్​ లీడర్'​ నటుడు కన్నుమూత

హ్యారీపోటర్​ నటుడు మృతి.. ఆ కారణంతోనే..

Last Updated : Feb 10, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.