ETV Bharat / entertainment

మిస్‌ వరల్డ్‌గా నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ భామ క్రిస్టినా- టాప్​ 8లో సినీశెట్టి - Miss World 2024 Winner

Miss World 2024 Winner : మిస్‌ వరల్డ్‌-2024 విజేతగా నిలిచారు చెక్​ రిపబ్లిక్​కు చెందిన భామ క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszkova). శనివారం ముంబయి వేదికగా జరిగిన ఫైనల్​లో కిరీటం దక్కించుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీశెట్టి టాప్‌-8కు పరిమితమయ్యారు

Miss World 2024 Winner
Miss World 2024 Winner
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 6:16 AM IST

Updated : Mar 10, 2024, 6:53 AM IST

Miss World 2024 Winner : మిస్‌ వరల్డ్‌-2024 విజేతగా నిలిచారు చెక్​ రిపబ్లిక్​కు చెందిన భామ క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszkova). శనివారం ముంబయి వేదికగా జరిగిన ఫైనల్​లో కిరీటం దక్కించుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీశెట్టి టాప్‌-8కు పరిమితమయ్యారు.

పోటీలో 112 దేశాలకు చెందిన అందాల భామలు
ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన 71వ మిస్​ వరల్డ్ వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్​-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), యాస్మిన్‌ అజైటౌన్‌ (లెబనాన్‌), అచే అబ్రహాంస్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్‌ వరల్డ్‌ కిరీటం క్రిస్టినాకు దక్కింది. రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్‌ నిలిచారు.

8వ స్థానంలో భారత్
ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీశెట్టి టాప్‌-8కు పరిమితమయ్యారు. ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చినా, అజైటౌన్‌ (లెబనాన్‌) టాప్‌-4కు ఎంపిక కావడం వల్ల సినీ శెట్టి అక్కడి నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును అందుకున్నారు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌ ఉమెన్‌ జూలియా మోర్లీ ఈ అవార్డును ప్రదానం చేశారు.

28 ఏళ్ల తర్వాత
భారత్​ వేదికగా ఈ మిస్ వరల్డ్ పోటీలు 28 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగాయి. ఈ పోటీలు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యాయి. దిల్లీలోని భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్​ వేదికలుగా మారాయి. ఇప్పటి వరకు ఇండియా నుంచి ఆరుగురు అందాల భామలు ఈ కిరీటాన్ని అందుకున్నారు. రీటా ఫరియా(1996), ఐశ్వర్యారాయ్‌ (1994), డయానా హెడెన్‌ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్‌ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు.

మిస్​ వరల్డ్ పోటీలుగా మారిన బికినీ కాంటెస్ట్​- మినిమమ్ ఏజ్ 17​- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

28 ఏళ్ల తర్వాత భారత్​ వేదికగా మిస్​ వరల్డ్​ పోటీలు- ప్రత్యేకతలివే!

Last Updated : Mar 10, 2024, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.