Mirzapur Munna bhaiya Divyendu Sharma : ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అంత సులభం కాదు. అయినా సినిమా పిచ్చితో సామాన్యులు ఎవరైనా పరిశ్రమలోకి అడుగుపెట్టారంటే చాలా ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అలా కొన్నేళ్ల పాటు కనీస సౌకర్యాలు లేకుండా కష్టపడి ఇండస్ట్రీలో మంచి పేరు సాధించిన నటుల్లో ఒకరు దివ్యేందు శర్మ.
దివ్యేందు శర్మ మొదటి సినిమా : అందరికీ తెలిసినట్టుగా దివ్యేందు శర్మ నటించిన మొదటి సినిమా 2011లో వచ్చిన'ప్యార్ కా పంచనామా' కాదు. 2007లోనే మాధురీ దీక్షిత్ నటించిన 'ఆజా నచ్ లే' చిత్రంలో కనిపించారు దివ్యేందు. ఇందులో ఆయన ఎమ్మెల్యే అనుచరుడిగా( గూండాగా) తెరమీద మెరిసి వెళ్లారు. కానీ లవ్ రంజన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా రిలీజ్ అయిన 'ప్యార్ కా పంచనామా'తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు దివ్యేందు.ఈ చిత్రానికిగానూ ఆయన 'మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్'గా అవార్డు కూడా గెలుచుకున్నారు.
ఆ తర్వాత డేవిడ్ ధావన్ నటించిన 'చష్మే బద్దూర్', అక్షయ్ కుమార్ నటించిన 'టాయిలెట్:ఏక్ ప్రేమ్ కథా', షాహిద్ కపూర్ నటించిన 'బట్టీ గుల్ మీటర్ చాలు' చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు దివ్యేందు. ఇలా ఎన్ని పాపులర్ సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ 2018 వరకూ ఆయన కెరీర్లో ఎలాంటి బ్రేక్ రాలేదు. అయితే ఓటీటీ హవా పెరిగిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'మీర్జాపూర్'లో మున్నా త్రిపాఠి పాత్ర దివ్యేందుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో ఆయన నటన మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఇండస్ట్రీలో ఆయన స్టార్ డమ్ బాగా పెరిగింది. ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీలతో కలిసి క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న 'మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్' సినిమాలో దివ్యేందు మంచి పాత్రలో నటిస్తున్నారు.
తిండి కోసం హోటల్లో పనిచేసి : దిల్లీలో పుట్టి పెరిగిన దివ్యేందుకు చదువు పెద్దగా అబ్బకపోవడంతో నటనవైపునకు మొగ్గు చూపారు. 2006 తర్వాత సినిమాల్లో నటించేందుకు ముంబయి నగరానికి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించారు. అప్పట్టో గోరేగావ్ నగరంలో నలుగరితో కలిసి అద్దె గదిని పంచుకునేవారట. తినడానికి డబ్బులేక ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పనిచేసి రూ.32లు సంపాదించిన విషయం ఎప్పటికీ మర్చిపోనని ఈటైమ్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివ్యేందు చెప్పుకొచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కల్కి' బ్యూటీ దిశాపటానీ సిస్టర్ను చూశారా? - ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగి - khushboo patani